ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే బంధువులు, స్నేహితులంటూ పెత్తనం చెలాయించే వీలు లేకుండా చేస్తానని ఈ విషయంలో తన భర్తకు అదే వర్తిస్తుందని అమె అన్నారు. ఇకపోతు గతంలో తన భర్త అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించినంత మాత్రాన తాను గెలిస్తే ఆయనకు ప్రత్యేక అభిమానం ఏమీ చూపించేది లేదని తాను ప్రజల పక్షన ఉండే వ్యక్తి అని అన్నారు.

ఇక బిల్‌క్లింటన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆమె ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  హిల్లరీ పదవిలోకి వస్తే ఆమె భర్త రాజకీయాల్లో జోక్యం చేసుకోవచ్చుకదా అన్న ప్రశ్నలు, విమర్శలపై హిల్లరి ఈ విధంగా స్పందించారు.  

ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారయినట్లే. కానీ డెమొక్రటిక్ పార్టీలో బెర్నీ శాండర్స్, హిల్లరీ క్లింటన్ మధ్య పోరు నడుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో శాండర్స్ విజయకేతనం ఎగురవేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: