అమెరికాలో గత కొంత కాలంగా తెలుగు వారి ప్రస్థానాన్ని చాటి చెప్పే విధంగా ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చెపడుతుంది.  ఇక ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు డల్లాస్ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సాంప్రదాయాలు,  సంస్కృతి ని చాటి చెప్పేవిధంగా ఈ మహాసభలు ఉండబోతున్నాయని నిర్వహాకులు చెబుతున్నారు. అంతే కాదు ఈ మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని నిర్వాహకులు అన్నారు.

ఈ సభలు విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నామని నాటా ప్రతినిధులు తెలిపారు. ఈ సభలు తెలుగు వారి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. . నాటా అధ్యక్షుడు మోహన్ మల్లం తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: