చమురు.. సౌదీ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు! కానీ ఇటీవలికాలంలో ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. కేవలం చమురుపైనే ఆధారపడకూడదని ఆ దేశం నిర్ణయించుకుంది. ఇతరత్రా ఆదాయం పెంపుపైనా.. వ్యయం తగ్గింపుపైనా దృష్టి సారించింది. ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు’ అనే కథ చందంగా.. మిషన్ 2030 పేరుతో సౌదీ యువరాజు చేపట్టిన సంస్కరణల దెబ్బ అటు తిరిగి ఇటుతిరిగి విదేశీ కార్మికులపై పడుతోంది! మన కార్మికుల ‘చమురు’ వదులుతోంది!!