దేశంకాని దేశంలో ఓ తెలుగువాడు కనిపించి పలకరిస్తే హ్యాపీగా ఫీలవుతాం. అలాంటిది కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఇంటికి పిలిపించుకొని రాచమర్యాదలు చేస్తే, చక్కని తెలుగులో మాట్లాడుతూ ఆప్యాయతలు ఒలకబోస్తే ఫిదా అవకుండా ఉంటామా? సౌదీలో రెండేళ్ల క్రితం స్థిరపడ్డ ఓ తెలుగాయన తోటి తెలుగువారిని ఈ విధంగానే ఆకర్షించాడు. తన భార్య పేరిట ఓ ఇండస్ట్రీన నడుపుతూ పెట్టుబడులను ఆహ్వానించాడు. ప్రతిగా భారీగా లాభాలు, వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపాడు. అతని రాచభవనం లాంటి ఇల్లు అదీ చూసి నమ్మకంకొద్దీ కొందరు అతని వ్యాపారంలో పెట్టుబడి పెట్టార