వర్షాలతో సౌదీ అరేబియా అతలాకుతలం అవుతోంది. సౌదీలోని అసీర్ ప్రాంతం వరదల్లో చిక్కుకుపోయింది. వరదల్లో చిక్కుకుని ఒకరు మృత్యువాత పడగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 280 మందిని విపత్తు నివారణ అధికారులు రక్షించారు. పది మందికి తీవ్రగాయాలయ్యాయని అధికారులు తెలిపారు. అభా నగరంలో ప్రజలంతా సురక్షితంగానే ఉన్నారనీ, కానీ.. వాహనాలకు మాత్రం నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇంటి ముందు నిలిపిన కార్లు కూడా వరదలకు కొట్టుకుని పోయాయని తెలిపారు.



ఈ వరదల వల్ల ప్రజల దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలిగింది. అందరూ ఇళ్లల్లో కూర్చుని బయటకు రాకుండా ఉన్నారు. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. శుక్రవారం వరకూ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సౌదీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే ఓ వీడియోను మీరూ ఓ సారి చూడండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: