అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి 1200 మందికి పైగా ఆటా మహిళా అభిమానులు హాజరయ్యారు. మహిళల ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల అన్నమాచార్య గీతాలు అతిథులను ఆకట్టుకున్నాయి. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు పాటలు, నృత్యాలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ మహిళ బార్బరా కంస్టాక్, లౌడౌన్ కౌంటీ బోర్డు అఫ్ సూపర్వైసర్ ఫిలీస్ రాన్డల్ హాజరై మహిళాసాధికారతపై ప్రసంగించారు. మహిళలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.



మహిళల సాధికారత త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్బరా మాట్లాడుతూ ప్రస్తుతమున్న వర్జీనియా అసెంబ్లీలో తాను ఒక్కదాన్నే మహిళనని, మహిళల ప్రాధాన్యం అమెరికా చట్టసభలలో పెరగాలని పిలుపునిచ్చారు. ఫిలీస్ మాట్లాడుతూ లౌడాన్ కౌంటీ బోర్డులో తాను మొట్ట మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళనని అన్నారు. భారతీయ మహిళలు కూడా అమెరికా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని రెప్రెసెంతతివెస్ కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: