భారత మహిళపై ఒక వ్యక్తి లైంగికదాడి చేయబోయాడు. నిందితుడిని పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గురువారం రాత్రి గం.3-15నిమిషాలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఒక ప్రయివేటు కంపెనీలో సెక్రెటరీగా పనిచేస్తోంది. గురువారం రాత్రి విధులు ముంగించుకుని ఇంటికి బయలుదేరింది. బస్సెక్కి తన ఇంటి సమీపంలో దిగింది. ఆమెనే అనుసరిస్తున్నా ఆ వ్యక్తి, ఆమె బస్సు దిగగానే పక్కకు లాక్కెళ్లాడు.



అక్కడ అంతా చీకటిగా ఉంది. ఆమెపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో ఆమెను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడిని వెంబడించింది. పారిపోతున్న అతడు, తాను పాకిస్తాన్ నుంచి వచ్చానని చెప్పాడంది. తన పేరు చెప్పేందుకు మాత్రం ఇష్టపడలేదని ఆమె కోర్టుకు తెలియజేసింది. తాను ఇంటికి చేరుకున్న తర్వాత సెక్యూరిటీ గార్డులతో విషయం చెప్పానంది. వారు చుట్టుపక్కల గాలించి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోచ్చరంది. కానీ, వారు నిందితులు కాకపోవడంతో వదిలిపెట్టారంది. తర్వాత కొద్ది క్షణలకు మరో వ్యక్తిని పట్టుకోచ్చారని, అతడే నిందితుడని గుర్తుపట్టి పోలీసులకు అప్పగించమని తెలిపింది. కోర్టు మూడు నెలలపాటు జైలు శిక్ష విధించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: