స్వదేశానికి వెళ్తున్న మిత్రున్ని విమానశ్రాయంలో దింపడానికి, మెదక్ జిల్లాకు చెందిన ఒక ప్రవాసీయుడు కారులో బయలుదేరాడు. మెదక్ జిల్లా మెయినాబాద్ మండలానికి చెందిన అయ్యవారి నంద కిశోర్ ఆబుధాబిలో ఒక కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. అతని సహాద్యోగి ఒకరు సెలవుపై స్వదేశానికి వెళ్తుండడంతో అతన్ని విమానశ్రాయంలో దింపడానికి తన కారులో వెళ్లాడు. అలా వారు బయలుదేరిన కొద్దిసేపటికే తనఖీలో భాగంగా నందకిశోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.



అతడు అక్రమంగా టాక్సీ నడుపుతున్నాడని అబియోగం నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతడికి 25,000  దిర్హమ్స్( సుమారు నాలుగున్నర లక్షల రూపాయాలు) జరిమానా విధించింది. నందకిశోర్ హైకోర్టులో అప్పీల్ చేయగా,  హైకోర్టు దాన్ని 10 వేలకు తగ్గించింది. అప్పటికే 40 రోజులుగా జైలులోఉన్నానని, తన కారాగార వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరగా కోర్టు జరిమానాను 6 వేల దిర్హమ్స్ (ఒక లక్ష 5 వేల రూపాయాలు)కు తగ్గించింది. జైలుశిక్ష అనుభవించాడనే, కారణంగా కంపెనీ అతన్ని ఉద్యోగం నుండి తొలగించడానికి ప్రయత్నించింది. ఆబుదాబిలోని అతని సహాచరులు మరియు తెలంగాణ ప్రవాసీయులందరూ కలిసి జరిమానా చెల్లించడంతో నందకిశోర్ బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: