అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యపై ఆయన కుమారుడు హంజా పగతో రగిలిపోతున్నాడు. తన తండ్రి స్థానంలో అల్‌ఖైదీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టి అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. లాడెన్‌పై చేపట్టిన 9/11 దాడుల విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ అలీ సౌఫాన్ ఈ విషయాన్ని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు. తన తండ్రిని విపరీతంగా ఇష్టపడే హంజా ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లి, తన తండ్రిని మట్టుబెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అల్‌ఖైదా అత్యున్నత బాధ్యతలు పట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. లాడెన్‌ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖలను తాము స్వాధీనం చేసుకున్నట్టు సౌఫాన్ తెలిపారు. జీహాదీలను అందరిన్నీ ఏకం చేసి లక్ష్యం సాధించడానికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడేది లేదని 22 ఏళ్ల హంజా ఒక లేఖలో పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం హంజా 28వ పడిలోకి అడుగుపెట్టాడని, లాడెన్‌కూ, హంజాకు మధ్య చాలా పోలికలు కనబడుతున్నాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: