ఉగ్రవాదులు, ఉగ్రవాదసంస్థలకు ఆర్థిక సహకారం అందించిన ఖతార్‌పై యూఏఈ తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. ఖతార్‌పై ఇప్పటికే దౌత్య సంబంధాలను తెంచుకున్న దేశాల జాబితాలో ఉన్న యూఏఈ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈ గగనతలంపై ఖతార్‌కు చెందిన విమానాలు, విమాన సంస్థలపై  నిషేదం విధించింది. ఖతార్‌కు చెందిన ఏ విమానాలైన సరే తమ గగనతలంపై ఎగరడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ నిషేదం కేవలం ఖతార్‌కు చెందిన విమానాలు, విమాన సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.



ప్రైవేట్ విమానాలు అనుమతి తీసుకుని తమ గగనతలంపై నుంచి ఖతార్‌కు ప్రయాణించవచ్చునని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) పేర్కొంది. కానీ.. తమ గగనతలం నుంచి ఖతార్‌కు, ఖతార్ నుంచి వెళ్లే ప్రైవేట్ సంస్థల విమానాలు 24 గంటల ముందు తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణించే విమాన వివరాలు,  ప్రయాణికులు, సిబ్బంది పూర్తి వివరాలను క్షుణంగా చెప్పాలని పేర్కొంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ‘ చికాగో కన్వెన్షన్ 1944 ప్రకారం తామ నడుచుకుంటున్నామని ప్రకటనలో తెలిపింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: