రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ఎక్కువగా షాపింగ్ చేస్తారనేది తెలిసిన విషయమే. కొత్త దుస్తుల దగ్గర నుంచి, ఇంట్లో అవసరం అయే వంట సమాను వరకూ అన్నీ కొనుగోలు చేస్తుంటారు. ప్రతి షాప్‌కు వెళ్లి ఒక్కో వస్తువును కొనే కంటే ఆన్‌లైన్‌లో కొంటే కాస్త నయం అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గల్ఫ్ దేశాలతోపాటు భారత్‌లోనూ సేవలందిస్తున్న కొన్ని ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. awok.com, Crazydeals.com, joigifts.com.. వంటి వెబ్‌సైట్లు దాదాపు 90 శాతం డిస్కౌంట్‌తో భారీ ఆఫర్లను ఇస్తున్నాయి.awok.comలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, హెల్త్, బ్యూటీ ఉపకరణాలు, నగలు.. వంటి వాటిపై 49 నుంచి 81 శాతం వరకూ డిస్కౌంట్‌ ఉంది. ‘రంజాన్ ఫీస్టా’ పేరుతో Crazydeals.comలో కూడా దాదాపు 80 శాతం వరకూ షాపింగ్ చేసుకోవచ్చు. joigifts.comలో అయితే ‘బిగ్ ఈద్ గిఫ్ట్ సేల్’ పేరుతో 90 శాతం వరకూ డిస్కౌంట్‌తో షాపింగ్‌ చేసుకోవచ్చు. జూన్ 20 నుంచి 23 లోపు మాత్రమే ఈ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కావాలంటే మీరూ ఓ లుక్కేసి షాపింగ్ చేసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: