ఎన్నికల్లో ప్రవాస భారతీయల(ఎన్నారైలు)కు పోస్టల్‌/ఈ-బ్యాలెట్‌ ద్వారా ఓటేసేందుకు అనుమతిస్తూ ఎన్నికల చట్టం లేదా నిబంధనల సవరణపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నిర్దేశించింది. ఎన్నారైలకు ఓటు అవకాశం కల్పించవచ్చని ప్రతిపాదిస్తూ గతంలో ఈసీ, విదేశీ వ్యవహారాలు, న్యాయశాఖల అధికారులతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను కేంద్రం, ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది.



దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికే రెండు సార్లు కేంద్రానికి గడువిచ్చిన విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. ఇక తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఎన్నారైలకు ఓటేసే అవకాశం కల్పించాలని కోరుతూ లండన్‌కు చెందిన ప్రవాసీ భారత్‌ సంస్థ ఛైర్మన్‌, మరికొందరు వ్యాజ్యాలను దాఖలు చేశారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌ హాజరయ్యారు. ఒక పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: