త్వరలో ఎన్నారైలు స్వదేశంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణలు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటీవల ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంపై రాజ్యాంగ సవరణలను చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం స్పందిస్తూ రాజ్యాంగ సవరణ చేసే యోచనలో ఉన్నామని మరో రెండు వారాల్లో పూర్తి వివరాలను కోర్టుకు అందజేస్తామని తెలిపింది.


విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్‌ బ్యాలెట్‌ లేదా ఈ బ్యాలెట్‌ ద్వారా ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను, సలహాలను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని సూచించింది. దీనిపై స్పందించిన కేంద్రం పూర్తి వివరాలను మరో రెండు వారాల్లోగా సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: