యుద్ధం గురించి తప్ప ఇతర విషయాలపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్ దృష్టిపెట్టడం లేదని ఎర్రిక్ లోఫెజ్ అనే అమెరికన్ పర్యాటకుడు చెబుతున్నాడు. 2008 నుంచి తాను ఇప్పటికి వరకు ఆరుసార్లు ఉత్తరకొరియాలో పర్యటించానని కానీ, అక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదని అతడు అన్నాడు. ఉత్తరకొరియాలో ఆహర కొరత తీవ్రంగా ఉందని వ్యవసాయానికి తగినంత భూమి కూడా ఆ దేశంలో అందుబాటులోలేదని అతడు అంటున్నాడు.



ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం లేని దేశం యుద్ధం చేస్తామంటూ అమెరికాను భయపెట్టాలని చూస్తోందని దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదని అతడు అన్నాడు. దేశం ప్రతి సంవత్సరం కరువుతో, వరదలతో అల్లాడిపోతోందని ఆ సమయంలో బయటి దేశాల సహయం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయని అతడు అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: