మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ హరితహారం కార్యక్రమం నిర్వహించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ని విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రం సుభిక్షంగా మారాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం తెలంగాణ వ్యాప్తంగా ఒక విప్లవంలా మారిందన్నారు.



భవిష్యత్తులో వాతావరణ కాలుష్య నివారణకు, వర్షాభావ పరిస్థితులను పెంపొందించడంలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పరిపాలనలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెడుతూ, బంగారు తెలంగాణ సాధనకు ఒక సైనికుడిలా కృషి చేస్తున్న కేటీఆర్పై  ప్రతిపక్షాలు కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే  చవకబారు విమర్శలు చేస్తున్నారని నాగేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనలో కేటీఆర్ కృషికి జాతీయ స్థాయిలో నాయకులు సైతం ప్రశంసిస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: