ఆటా.. "అమెరికా తెలంగాణా సంఘం" అత్యంత ఘనంగా రెండో ప్రపంచ మహాసభలని వచ్చే ఏడాది జూన్ నెలలో 29, 30 మరియు జులై 1 వ తేదీలలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్టుగా ఆటా అధ్యక్షుడు కందిమళ్ళ సత్యనారాయణరెడ్డి మరియు ఆటా సలహాదారు రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంలోనే  నవంబర్ 19 నుంచి డిసెంబర్‌ 3 వరకు తెలంగాణలో పలు సేవా కార్యక్రమాలతో పాటు చివరి రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

 Image result for american telangana association 2017 meeting at hyd

ఆటా ఇండియా ఈవెం ట్స్‌ కన్వీనర్‌ మంతెన.వెంకట్‌..సాంస్కృతిక విభాగం సలహాదారు డాక్టర్‌ గడ్డం పద్మజారెడ్డి..ఇండియా కన్వీనర్‌ అమ్రీత్‌ వీళ్ళందరితో కలిసి తెలంగాణలో ని ర్వహించనున్న కార్యక్రమాల విశేషాలను తెలియజేశారు. నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు తెలంగాణలోని హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో పలు జిల్లాల్లో విద్య, వైద్య సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా వెనకబడ్డ గ్రామీణ తమవంతు సహాయ సహకారాలు అందించే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.

 

ఆటా చివరి రోజు డిసెంబర్‌ 3న  డ్రగ్‌ ఫ్రీ హైదరాబాద్‌ కోసం నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో సినీనటు లు, ఆటా ప్రతినిధులు, రాజకీయ నాయకులు..ఆసక్తి గలవారు ఇలా సుమారు 5వేల మంది ప్రతినిధులతో 5కే రన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ముగింపు వేడుకని రవీంద్రభారతిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇదే వేదికమీద తెలంగాణాలో ఉన్న  సాంస్కృతిక కళాకారులకి సత్కారాలతో పాటు..పలు సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రవాసి తెలంగాణ ధూంధాం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో జరగనున్న ఆటా వేడుకల్లో అమెరికాకు చెందిన అన్ని తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని..సుమారు 50 మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆటా ప్రతినిధులు తెలిపారు.

 American Telangana Association Board Meeting

ఈ కార్యక్రమాలు ముందుగా 2018 జూన్‌ 29 నుంచి జూలై 1వ తేదీ వరకు అమెరికాలోని హూస్టన్‌ నగరంలో జరుగుతాయని..ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రతినిధులు, తెలంగాణకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొంటారని తెలిపారు. ప్రతీ రెండు సంవత్సరాలకి ఒకసారి జరుపుకునే ఈ వేడుకలు జరుపుతామని తెలిపారు..అమెరికాలో త్వరలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో కూ డా ఆటా (అమెరికా తెలంగాణ సంఘం) తమవంతు పాత్ర ఉంటుందని తెలిపారు. అమెరికాలు ఉన్న మన ఎన్నారైలు పుట్టిన భూమిని మరిచిపోకూదడనే ఉద్దేశంతో ఈ కార్యక్రంమాన్ని నిర్వహిస్తున్నాం అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: