ఇవాంకా పర్యటన ఆద్యాంతం ఎంతో ఆసక్తిగా సాగుతోంది..ఏంటో మంది అతిరధ మహారదుల మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న “గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ సమిట్‌” వేడుకలకి ఇవాంకా ట్రంప్ తో పాటు అనేకమంది డెలిగేట్స్ వచ్చారు..ఈ అమెరికన్ డెలిగేట్స్ బృందంతో మన తెలుగు వారైన పులి.రవి ఉండటం ఎంతో గర్వకారణం. పులి రవి అంటే ఎవరో కాదు అమెరికాలో ఉన్న ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్స్‌లో ఒకరు..

 Image result for పులి రవి

పులి రవి స్వస్థలం భూపాలపల్లి జిల్లలో ఓ మారుమూల గ్రామం..ఇప్పుడు ఈ సమ్మెట సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలియచేశారు. ఈ సదస్సులో పాల్గొనే అవకాశంతోపాటు అమెరికాలోని తమ అనుభవాలని మీడియాతో పంచుకున్న ఆయన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఇక్కడి యువత ఎలాగైతే పోరాడిందో... అలాగే ఇక్కడి అవకాశాలని కూడా సద్వినియోగపర్చుకుని జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు.

Related image



గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ సమిట్‌ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ యువ వ్యాపారవేత్తలు మరింత అభివృద్దిలో ముందుకు వెళ్ళాలని అభిప్రాయపడ్డారు...తెలంగాణలో వున్న నిరుద్యోగాన్ని పారదోలేందుకు తన వంతు బాధ్యతగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి సేవలు చేయాలని భావిస్తున్నట్టుగా అయన తెలిపారు.. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుయర్స్ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా వుందన్నారు ఈ ఎన్నారై ఇండస్ట్రియలిస్ట్.

 Image result for పులి రవి


మరింత సమాచారం తెలుసుకోండి: