ప్రతీ సంవత్సరం ప్రచురించే ప్రపంచ స్థాయి విధాన నిర్ణేతల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో  భారతీయ సంతతి మహిళ అమెరికన్ ,కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్ ప్రధమ స్థానంలో నిలిచారు. 2017 టాప్-50  జాబితాలో మొదటి స్థానం పొందిన కమలా... రిపబ్లికన్ల పాలనలోనూ డెమోక్రట్ల  ఉనికిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది..అయితే యుఎస్ సెనెట్ కి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా కమలా హారీస్ నిలిచారని తెలిపారు.

 Image result for kamala harris

కమల హారిస్ తల్లి భారత సంతతి ,మరియు తండ్రి జమైకా..ఆమెతో పాటుగా మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు కమెడియన్,హాసన్ ,సౌత్ కరోలినా మాజీ గవర్నర్ ,ఐరాసాలో అమెరికా శాశ్వత ప్రతినిది నిక్కి హెలీలు కూడా స్థానం సంపాదించారు...సుమారు రెండు దశాబ్దాలపాటు న్యాయవాదిగా సేవలందించిన కమలా హారీస్ సామాజిక న్యాయం కోసం నిబద్ధతో పనిచేస్తున్నారని..ఏడాది నుంచి వలసదార్ల హక్కుల రక్షణకు కృషిచేస్తున్నారని... డెమోక్రటిక్ పార్టీలో క్లింటన్ తర్వాత అంతటి గుర్తింపు పొందిన మహిళగా ఫారిన్ పాలసీ పత్రిక ప్రశంసించింది.

 

 

హారీస్ తర్వాత రెండవ స్థానంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మూన్ జేన్ నిలువగా మూడో స్థానంలో కమేడియన్ హసన్ మిన్హాజ్ నిలిచాడు. తన హాస్యంతో టెలివిజన్ ప్రేక్షకులను నవ్విస్తూ అమెరికాలో పాపులర్ కమేడియన్‌గా గుర్తింపు పొందారు...అమెరికా అధ్యక్షుడి క్యాబినెట్‌లో స్థానం పొందిన తొలి ఇండియన్ అమెరికన్‌గా గుర్తింపు పొందిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ... అంతర్జాతీయ సంబంధాలలో సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానాలను పాటిస్తున్నారని ఆ పత్రిక కితాబిచ్చింది. ఏది ఏమైనా మన భారతీయులు అమెరికాలో అత్యంత కీలకమైన పదవులలో ఉండటం ఎంతో గర్వ కారణం.

Image result for kamala harris global thinkers

మరింత సమాచారం తెలుసుకోండి: