అమెరికాలో జత్యహంకారానికి బలై పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల సంఘటన అందరికీ తెలిసిందే..ఆ సంఘటన ఎంతో మంది భారతీయులలో భాదని నింపింది..ఎంతో మంది ఎన్నారైలు అందోళనకి లోనయ్యారు..అది ఎంతో విషాదకరమైన సంఘటన అంటూ అమెరికా కూడా ఖండించింది..ఆసమయంలో అక్కడే ఉంది శ్రీనివాస్ ని కాపాడటానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డ యువకుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హీరో అయ్యాడు..

 Image result for ian grillot

భారతీయుడి ని కాపాటానికి బుల్లెట్లకి సైతం ఎదురెళ్ళి పోరాడిన వ్యక్తిగా ఇప్పుడు ఈ అమెరికన్ యువకుడు టైం మేగజైన్ హీరోగా పొగిడింది..జాత్యాహంకార దాడి సమయంలో నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డ అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రిల్లోట్‌ను టైమ్ మేగజైన్ ప్రశంసించింది. అమెరికా హీరోగా పొగిడింది. 5 హీరోస్ హూ గేవ్ యూఎస్ హోప్ ఇన్ 2017  పేరిట ఐదుగురు అమెరికన్లను ఎంపిక చేసి హీరోలుగా స్థానం కల్పించింది. ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా భయపడకుండా దుండగుడికి ఎదురెళ్లి బుల్లెట్ గాయం పాలవ్వడాన్ని మేగజైన్ మెచ్చుకుంది.

 

 

24 ఏళ్ల ఇయాన్..కన్సస్‌లో ఫిబ్రవరిలో తెలుగు వ్యక్తులపై బార్‌లో కాల్పులకు పాల్పడుతున్న దుండగుడు ప్యూరింగ్టన్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఇయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల మృతిచెందగా శ్రీనివాస్ మిత్రుడు..మిత్రుడు అలోక్ మడసాని ప్రాణాలతో బయటపడ్డ సంగతి తెలిసింది. ఇయాన్‌కు సెల్యూట్ చేస్తున్నామని టైమ్ మేగజైన్ పేర్కొనడం విశేషం.ఇప్పుడు అతడు అమెరికాలో హీరో అయ్యాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: