తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కనిది, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి దక్కింది! అదే.. మోడీ అపాయింట్ మెంట్! దాదాపు పక్షం రోజులకు పూర్వం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లాడు. వివిధ అంశాల గురించి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడానికి బాబు ఢిల్లీ వెళ్లాడు.అందులో భాగంగా కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యాడు. అయితే ప్రధానమంత్రి మోడీతో సమావేశం కావడం తో బాబు ఢిల్లీ పర్యటన ముగియాల్సి ఉంది. అయితే... అది జరగలేదు. మోడీ అపాయింట్ మెంట్ కోసం అంతకుముందే రిక్వెస్ట్ చేసుకొన్నా అపాయింట్ మెంట్ దొరకలేదు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాల్లో గెయిల్ ప్రమాదం జరిగింది. దీంతో బాబు ఉన్నఫలంగా ఢిల్లీ నుంచి వెనక్కు వచ్చేశాడు. ప్రమాద బాధితులను పరామర్శించడానికి బాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొన్నాడు. పర్యటన రద్దు చేసుకొన్నప్పటికీ.. అంతకు ముందు మోడీ అపాయింట్ మెంట్ అయితే ఖరారు కాలేదన్న విషయాన్ని ఇక్కడగమనించాలి. అయితే ఇప్పుడు జగన్ కు మాత్రం ఎంచక్కా ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ లభించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రపతి ప్రణబ్ లను కలిసి తను చెప్పదలుచుకొన్నది చెప్పుకొని వచ్చాడు జగన్ మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ కూడా ఖరారు అయ్యింది. మొత్తానికి బాబు సాధించుకోలేని జగన్ సాధించుకొన్నాడు. దీని వల్ల జగన్ కు అదనపు లబ్ధి ఏమైనా కలుగుతుందా? అంటే చెప్పలేం కానీ, అపాయింట్ మెంట్ ను సాధించుకోవడం మాత్రం కొంత వరకూ బీజేపీ వైకాపాను ఆదరిస్తోందనేదానికి నిదర్శనం అని అనుకోవచ్చునేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: