సీమాంధ్ర - సింగపూర్ వంటి ప్రాసలతో తెలుగుదేశం వాళ్లు జనాలను బాగా ఆకట్టుకొన్నారు. సీమాంధ్రను సింగపూర్ గా మార్చేస్తామంటూ ప్రజలను ఊరించారు. అనుకూల మీడియా ద్వారా సింగపూర్ గ్రాఫులు, సింగపూర్ గొప్పదనాన్ని ఏమిటో తెలియజెప్పి... సీమాంధ్రను కూడా అలాగే మారుస్తామంటూ ప్రజలను ఆకట్టుకొన్నారు. ఎన్నికల ముందు వైఎస్ వారబ్బాయి తన తండ్రి పాలన గురించి ఎంత చెప్పినా.. జనాలను సింగపూర్ ప్లాన్ కే మద్దతు తెలిపారు. అయితే తెలుగుదేశం వాళ్లు ఎన్నికలు అయ్యాకా.. జనాలను మరింతగా భ్రమల్లోకి తీసుకెళ్లడానికే ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు సీమాంధ్ర సింగపూర్ మాత్రమే కాకుండా సీమాంధ్ర సన్ రైజ్ కంట్రీ అనే కొత్త నినాదాన్ని కూడా వదిలారు. అయితే ఈ సన్ రైజ్ కంట్రీ అనే దానికి పెద్దగా జస్టిఫికేషన్ లేదని చెప్పవచ్చు! భూగోళశాస్త్ర పరంగా చూసుకొంటే జపాన్ ను సన్ రైజ్ కంట్రీ అని అంటారు. సూర్యుడు ఉదయించే భూమిగా పేరుంది జపాన్ కు. భూమిపై సూర్యకిరణాలు తాకే తొలి నేలగా జపాన్ కు పేరుంది. మన దేశం విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ కు సూర్యుడు ఉదయించే నేలగా పేరుంది. దేశంలో తొలిసారి సూర్యకిరణాలు తాకేది ఆ ప్రాంతాంలోనే అనే పేరుంది. మరి ఇలాంటి లెక్క ప్రకారం చూసుకొంటూ సీమాంధ్రకు సన్ రైజ్ కంట్రీ అనే పేరు అంతగా యాప్ట్ కాదు. మరి బాబు ఎందుకు అలా అన్నాడు.. అని అంటే... ఈ విషయంపై విశ్లేషకులు కొత్త థియరీ చెబుతున్నారు. "సన్ రైజ్ కంట్రీ'' అనే నినాదంలో సన్ అంటే సూర్యుడు కాదని, సన్ అంటే ఇక్కడ కుమారుడు అనే మీనింగ్ తీసుకోవాలని వారు చెబుతున్నారు, బాబు కుమారుడు అయిన లోకేశ్ బాబు రానున్న ఐదేళ్లలో ఒక పెద్ద శక్తిగా ఎదుగుతాడనే మీనింగ్ ఆ నినాదంలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం బాబు ఇచ్చిన నినాదం అర్థవంతంగా ఉందని వారు అంటున్నారు. మరి సన్ రైజ్ కంట్రీ అంటే.. లోకేశ్ రైజింగ్ కంట్రీ అనమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: