ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎర్రచందనం నిల్వల అమ్మకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఈ అనుమతి ఇవ్వడానికి కేంద్రం వెనుకాడింది.అయితే టిడిపి మిత్రపక్షమైన బిజెపి ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వడం విశేషం. స్టాక్ పెట్టి ఉన్న ఎర్రచందనం నిలువలను వేలం వేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. 8,584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం నిల్వల విక్రయానికి 15 రోజుల్లోగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించినట్లు ఆయన తెలియచేశారు.అయిదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉందని ఆయన చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు కాగా ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: