తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కల్వకుంట్ల కవిత.. కాశ్మీర్ అంశం గురించి మాట్లాడి ఇప్పుడు ఇంటా బయట విమర్శల పాలవుతోంది. కాశ్మీర్ మనది కాదని, అక్కడ సరిహద్దులను పునర్నిలిఖించాలని కవిత వ్యాఖ్యానించింది. తాము తెలంగాణ అంశం గురించి పోరాడినట్టుగానే కాశ్మీర్ అంశం గురించి కూడా పోరాడతామని కవిత వ్యాఖ్యానించింది. కవిత తనకు సంబంధం లేని అంశం గురించి ఈ విధంగా మాట్లాడటం అనవసరమే అని అనుకోవచ్చు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ వాళ్లు, భారతీయ జనతా పార్టీ వాళ్లు విరుచుకుపడ్డారు. కవిత కాశ్మీర్ అంశం గురించి మాట్లాడటమే తప్పు అయితే.. కాశ్మీర్ ను భారత అంతర్భాగం కాదని వ్యాఖ్యానించడం మరింత దురదృష్టకరమని ఆ పార్టీల నేతలు అంటున్నారు. ఆమె మాటల ను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ పాలకుడు తన రాజ్యాన్ని భారత్ లోకి విలీనం చేశాడని, అలాంటి చరిత్ర గురించి తెలుసుకోకుండా కవిత మాట్లాడటం శోచనీయమని వారు అంటున్నారు. ఓవరాల్ గా కవిత ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడింది. కవిత మాటలు జాతీయ వాదులను కూడా కలవరపెడుతున్నాయి. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న ఆమె ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక సేవ పేరుతో వార్తల్లోకి రావాలని ప్రయత్నించే వాళ్లలో కొందరు కాశ్మీర్ అంశం గురించి మాట్లాడుతుంటారని, తమకు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ వార్తల్లోకి వస్తుంటారు. ఇప్పుడు కవిత కూడా అలాగే స్పందించింది. కాశ్మీర్ ను మనది కాదని ఈమె వ్యాఖ్యానించింది. మరి చదువుకొన్న వ్యక్తి అయిన కవిత, ఎంపీ హోదాలో ఉండి... ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని జాతీయవాదులు మండి పడుతున్నారు. ఆమెపై జాతివిద్రోహం కేసును నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: