ఇన్ని రోజులూ తెలుగుదేశం పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిన కమ్మ వర్గం ఆధిపత్యం ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వైపుకు వచ్చిన రెడ్డి సామాజికవర్గపు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు కొత్త కొత్త రచ్చలకు కారణం అవుతున్నారు. వీళ్లను చూసుకొని టీడీపీలోనే ఉండిన కొంతమంది పాతకాపులు కూడా రెచ్చిపోతుండటం విశేషం. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. తమకు టీడీపీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని భావిస్తున్న రెడ్డి సామాజికవర్గపు ఎమ్మెల్యేలు తమ వర్గానికి నామినేటెడ్ పోస్టులు దక్కేలాచూసుకొంటున్నారు. ఈ విషయంపై అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది రెడ్డిఎమ్మెల్యేలు తమ వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కనివ్వడం లేదని చంద్రబాబు వద్దకే ఫిర్యాదులు వస్తున్నాయట. ఇన్నేళ్లూ కాంగ్రెస్ పాలనలో చక్రం తిప్పిన వాళ్లే ఇప్పుడు కూడా ప్రాధాన్యత దక్కించుకొంటున్నారని, తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన మాజీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడుకూడా పాతవారికే ప్రాధాన్యతనిస్తున్నారని... ఇది ఏ మాత్రం సహించరానిదని వారు మొత్తుకొంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఆ ఎమ్మెల్యేలను, మంత్రులను కదిలిస్తున్నాడట. అయితే వాళ్లంతా పార్టీ కోసం పనిచేశారని, కులాలు చూసుకోండా వారికి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందేనని ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు బాబుకుస్పష్టం చేస్తున్నట్టు భోగట్టా. ఏదేమైనా కమ్మ సామ్రాజ్యంలో ఇప్పుడు రెడ్డి నేతల ప్రస్థానం, అధిప్యత పోకడలకు దారి తీస్తోంది. దీనికి పర్యవసనంగా అక్కడక్కడ తీవ్రమైన గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇవి మరింత తీవ్రంగా మారే అవకాశాలూ లేకపోలేదు. మరి ఈ సమస్యను తెలుగుదేశం అధినేత ఎలా పరిష్కరిస్తాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: