రుణ మాఫీ పథకం అమలును అందరూ స్వాగతిస్తున్నా, విపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం నోరు మెదపడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి బొజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రుణ మాఫీ పథకం అమలుపై జగన్ తీరు తేలు కుట్టిన దొంగ మాదిరిగా ఉన్నదన్నారు. ఇలాంటి విపక్ష నేత రాష్ట్రానికి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడవేసేందుకే రుణ మాఫీ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రుణ మాఫీ పథకాన్ని అభినందించడానికి బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రుణ మాఫీ పథకం అమలుకు వ్యతిరేకులని ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తే, లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.5 లక్షల వరకు రుణ మాఫీ చేస్తున్నామని బొజ్జల తెలిపారు. వైఎస్ జగన్, ఆయన సొంత పార్టీని ఓదార్చుకునే పరిస్థితిలో ఉన్నారని బొజ్జల, ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: