నాణ్యతలో రాజీపడకుండా పంట దిగుబడి పెంపునకు కృషి చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. భారత వ్యవసాయ పరి శోధనా సంఘం 86వ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్య క్రమంలో నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా ప్రసంగించారు. రేడియోల ద్వారా వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు రైతులకు చేరువ కావాలని సూచించారు. ప్రయోగశాలల్లో పరిశోధనలు క్షేత్రస్థాయిలో అందు బాటులోకి రావాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి పరిశోధ నలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 'ల్యాబ్‌ టు ల్యాండ్‌' (పరిశోధన శాల నుండి పొలా ల్లోకి) నినాదాన్ని మోడీ తీసుకొచ్చారు. తమ ఆదాయాన్ని పెంచు కోవడం కోసం రైతులు ఉత్పత్తిని గణనీ యంగా పెంచాలని కోరారు. ఫలితంగా దేశానికి, ప్రపం చానికి ఆహారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తక్కువ భూమి, తక్కువ సమయం లో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు పెంచ డానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవాల్సిన ఆవశ్యకతను ప్రధాని ఉద్ఘాటించారు. వాతావరణ మార్పు సవాళ్లు, సహజ వనరులు తగ్గిపోవడంపై మోడీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ క్రమం లోనే తక్కువ భూమి-తక్కువ సమయంలో ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం వుంద న్నారు. హరిత, శ్వేత విప్లవం తరహాలోనే మత్య్సరంగంలో నీలి విప్లవం తీసుకురా వాలని ఆయన పిలుపునిచ్చారు. 'మన ముందు రెండు సవాళ్లు వున్నాయి. అందులో ఒకటి దేశానికి, ప్రపంచానికి ఆహారం అందించ డానికి వీలుగా రైతులను మనం ఎలా సమర్ధ వంతులను చేయాలి. రెండోది... మన రైతుల జేబులు నింపడానికి వ్యవసాయ రంగాన్ని ఎలా పరిపుష్టం చేయాలి. ఈ రెండు అంశాలలో మనలను మనం నిరూపించుకోవాలి' అని మోడీ చెప్పారు. చిన్న నీటి చుక్క-మరింత పంట...ఇదే మన లక్ష్యమని ప్రధాని అన్నారు. భారత్‌ ఇంకా ఖాద్యతైలాలు, పప్పులు దిగుమతిపైనే ఆధారపడి వుందని, వ్యవసాయాభివృద్ధి విషయంలో స్వయం సమృద్ధి సాధించడంపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు విన్నవించారు. రైతులలో చైతన్యం పెంచడానికి వ్యవసాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతుల ఆదాయాలు పెరగకుండా వ్యవసాయ వృద్ధి లక్ష్యం సాధించలేమని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రభుత్వ విధానాలు వుంటాయన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: