కృష్ణా నదికి రెండు వైపులా నవ్యాం ధ్రప్రదేశ్‌ రాజధానిని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాలు తెలి పాయి. కృష్ణానదికి రెండు వైపులా అంటే నదికొ ఒక వైపు గుంటూరు జిల్లా ప్రాంతం ఉండగా నదికొ మరొకవైపు కృష్ణా జిల్లా ప్రాంతం ఉంది. అంటే రాజధానికి అవసరమైన భూ సేకరణను ప్రభుత్వం ఇటు గుంటూరు జిల్లాలోనూ అటు కృష్ణా జిల్లాలోనూ చేస్తుందన్న మాట. కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నిర్మాణం జరగాలనేది చంద్రబాబు మదిలోని మాటగా తెలుస్తోంది. అత్యు త్తమ సాంకేతిక హంగులతో, అత్యద్భుతంగా నిర్మించనున్న రాజ ధానిలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలని చంద్రబాబు గట్టి నిర్ణ యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ఆకాశహర్య్మాలు నిర్మించి నపుడు పై అంతస్తులనుండి ఎటు చూసినా నదిలో నీరే కనబడా లన్నది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. ఇపుడు హైదరాబాద్‌ లోని సచివాలయంలో జె బ్లాక్‌లోని పై అంతస్తుల్లో నుండి చూస్తే ట్యాంక్‌బండ్‌ మొత్తం స్పష్టంగా కనబడుతుంది. అదే తరహాలో నదికి రెండువైపులా ఆకాశహర్మ్యాలను నిర్మించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. అమెరికాలోని కొన్ని నగరాలు నదుల వడ్డున నిర్మించారు. ఆ తరహాలో ఏపి రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కోరిక. అదే విధంగా సింగపూర్‌ మాదిరిగా భవిష్యత్తులో దేశానికే వాణిజ్య రాజధానిగా మారాలనే తలంపుతో ఆకాశహర్మ్యా లను నిర్మించాలని ఆయన ఆలోచిస్తున్నారు. వాణిజ్య సముదా యాలు ఉన్నచోట అవే ఉండాలి. అదే విధంగా వినోదానికి కేటాయించిన స్థలంలో వినోదానికి సంబంధించిన భవనాలే ఉండాలి. ఆ విధంగా వేరువేరు సిటీలను కలిపి రాజధానిగా మార్చాలని చంద్రబాబునాయుడి యోచనగా ఉంది. దీనికి అమెరికాలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు డిజైన్‌ రూపొందించి ఇచ్చారని అంటున్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములును రైతుల నుండి సేకరించటంలో చంద్రబాబు ఇప్పటికే ఐదుగురు మంత్రులతో ఒక కమిటీని వేసిన సంగతి తెలిసిందే. మంత్రులే కాకుండా రెండు జిల్లాల్లోనూ రాజధానికి అవసరమైన భూ సేకరణకు వీలుగా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులను కూడా ముందుజాగ్రత్తగా కమిటీలో సభ్యులుగా చేర్చారు. కాబట్టి రైతుల నుండి భూములను సేకరించే బాధ్యత పూర్తిగా కమిటిదే. ఒక వేళ ఏదైనా కారణంతో రైతుల నుండి భూములను సేకరించలేకపోతే, అప్పుడే అటవీ భూముల గురించి ఆలోచించవచ్చని కమిటీలోని మంత్రులతో చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. భూ సేకరణకు ప్రభుత్వం రెండంచెల విధానాన్ని అవలంభిచనున్నది. ఒకటిః రైతులు వారంతట వారు వచ్చి రాజధాని నిర్మాణానికి తమ భూములను అప్పగించటం, లేదా రాజధాని నిర్మాణానికి తమ భూములను అప్పగించటం ద్వారా వారికి భవిష్యత్తులో కలిగే లబ్దిని వివరించి చెప్పటం. వారికి వివరించాలంటే అప్పుడు కమిటీకి పని పడుతుంది. అందుకనే, కమిటీలో ఐదుగురు మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన రెండు జిల్లాల శాసనసభ్యులకు చోటు ల్పించటం. నదికి కృష్ణా జిల్లా వైపు అంటే, విజయవాడ అర్బన్‌, రూరల్‌ మండలాలు, ఇబ్రహింపట్నం, గన్నవరం, ఉయ్యూరు, పెనమలూరు, కంచికచర్ల, కంకిపాడు తదితర మండలాలు వస్తాయి. అలాగే, గుంటూరు జిల్లా అంటే, తుళ్ళూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పట్టణం, పెదకాకాని, తెనాలితో పాటు మరికొన్ని మండలాలు వస్తాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామం నుండి రాజధాని నిర్మాణ పనులు మొదలవుతాయి. నదికి రెండు వైపులా ఉన్న రెండు జిల్లాలోనూ ఎటువైపు భూముల లభ్యత ఉంటే అక్కడే రాజధాని నిర్మించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. పై మండలాల్లో కొన్ని జాతీయ రహదారి 5కు దగ్గరగా ఉండటం కూడా కలసివచ్చే అంశంగా ప్రభుత్వంలోని కొందరు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల సమస్య కన్నా భూ సేకరణే కీలకమని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.భూ సేకరణలో కామన్‌ పూల్‌ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనున్నది. ఈ విధానంలో రాజధాని నిర్మాణానికి రైతుల నుండి తీసుకునే భూముల్లో మొత్తాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఈ విధంగా అభివృద్ధి చేసిన భూముల్లో 60 శాతం భూమిని ప్రభుత్వం తీసుకుని మిగిలిన 40 శాతం భూమిని తిరిగి రైతుకు ఇచ్చేస్తుంది. అంటే ఇపుడు సదరు భూమి ధర కన్నా, ప్రభుత్వమే అభివృద్ది చేసిన భూమి కాబట్టి రైతుకు తిరిగి దక్కే 40 శాతం భూమికి ధర బాగా పలుకుతుంది. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న 60 శాతం భూమి ధరకూడా రైతుకు దక్కిన 40 శాతం భూ ధరలు భర్తీ చేస్తాయి. దీని వల్ల రైతుకు తన వద్ద ఉన్న భూమికి అధిక ధర లభిస్తుంది. అదే విధంగా, ప్రభుత్వానికి కూడా ఇపుడు రూపాయి చెల్లించకుండానే అవసరమైన భూములు లభిస్తాయి. ఒకసారి అవసరమైన భూములను గనుక ప్రభుత్వం సేకరించగలిగితే వెంటనే అంతర్జాతీయ వాస్తు శిల్పులతో సంప్రదించి బిడ్డింగ్‌లను ఆహ్వానించటంతో పాటు అత్యుత్తమ డిజైన్‌ను అందించిన సంస్ధకు రాజధాని నిర్మాణ బాధ్యతను అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: