మెదక్‌ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణలో తెదేపాకు స్థా నం లేదని, ఆ పార్టీకి నూకలు చెల్లాయని రుజువైంద న్నారు. ఈ ఉపఎన్నికల్లో డబ్బును విపరీతంగా పంచా రని, తమ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసినా ప్రజలు తెరాస వెంటే ఉన్నారని చెప్పారు. తెదేపాతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా విలువ కోల్పోయిందన్నారు. బంగారు తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నామని, అన్నిరకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే కార్యాచరణ ప్రారంభమవు తుందని కేసీఆర్‌ వెల్లడించారు. ఇప్పటికి తాను రెండు జిల్లాల్లో మాత్రమే పర్యటించానని, త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని అన్నారు. మెదక్‌ ఉపఎన్నికల సందర్భంగా కొన్ని మీడియా ఛానళ్ళు పక్షపాత ధోరణి తో వ్యవహరించినా ఏమీ చేయలేక పోయాయని సీఎం ఎద్దేవా చేశారు. ప్రజలు తమపట్ల పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపారని సంతృప్తి వ్యక్తం చేశారు. నైతిక విజయం తమదేనంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, మూడో స్థానం దక్కడం నైతిక విజయమా? అంటూ కేసీఆర్‌ చమత్కరించారు.  దేశంలోనే ఏ పార్టీకి కనబడని ఆదరణ కనిపించింది దేశంలోనే ఏ పార్టీకి లభించని ప్రజాదరణ తెరాసకు దక్కిందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. వడోదరలో దేశ ప్రధాని నరేంద్రమోడీకి గత ఎన్నికల్లో 5,70,000 ఓట్ల మెజారిటీ రాగా, ఉపఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి కేవలం లక్షా 80 వేల మెజారిటీ రావడాన్ని గుర్తించాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం ఖచ్చితంగా వందకు వంద శాతం విజయం సాధిస్తామని సీఎం ధీమా వ్యక్తంచేశారు. గత చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌ రోడ్లను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా మారుస్తామన్నారు. తప్పు చేసినవారికి, అక్రమంగా నిర్మించిన వారికి ఖచ్చితంగా శిక్షలు వేస్తామన్నారు. ఇక హైదరాబాద్‌ను క్రమశిక్షణగా అభివృద్ధి చేస్తామన్నారు. గత పదేళ్ళ కాంగ్రెస్‌ పాలన అధ్వాన్నంగా తయారైందని, కనీసం నాలుగు లక్షల ఇళ్ళు గ్రేటర్‌ పరిధిలో ఉన్నాయన్న విషయమే జీహెచ్‌ఎంసీకి తెలియకపోవడం విడ్డూరమన్నారు. ఆ గృహాలకు పన్నులు కూడా వేయలేదని, సమగ్ర కుటుంబ సర్వే నివేదిక వచ్చిన నాలుగు రోజుల్లోనే అన్ని సరి చేస్తానని అన్నారు. జంటనగరాల్లో ప్రతి పేదవారికి ఇళ్ళు నిర్మించి ఇస్తామని, ఫుట్‌పాత్‌లపై భవిష్యత్తులో ఎవరూ పండుకునేందుకు వీలులేదన్నా రు. రాష్ట్రాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయం చేస్తా మని కేంద్రం హామీ ఇచ్చిందని కేసీఆర్‌ వెల్లడించారు. ఇటీవల తాను ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో తనకు ఈ హామీ ఇచ్చినట్లు కేసీఆర్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: