ఇప్పుడు కాదు... దాదాపు పదేళ్ల నుంచినే చెబుతున్నాడు టీఆర్ఎస్ అధ్యక్షుడు నిజాం మాప్రభువే అని! ఎన్నికలు సమీపించినప్పుడల్లా కేసీఆర్ కు నిజాం గుర్తుకు వస్తాడు. తెలంగాణ పరిధిలో విస్తృతంగా ఉన్న ముస్లిం ఓట్లను ఆకట్టుకోవడానికి నిజాంను ఒక అస్త్రంగా ఉపయోగించుకొంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మైనారిటీలను బుజ్జగించడానికి.. వారిని తన పార్టీకి దగ్గరకు చేర్చుకోవడానికి కేసీఆర్ ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. సానియా మీర్జాలకు రెండు దఫాలుగా రెండు కోట్ల రూపాయల డబ్బు ఇవ్వడం.. ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం కూడా వ్యూహాత్మకమేనని.. ఇదంతా మైనారిటీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నిజాం పాలన స్వర్ణయుగం అని తేల్చేశాడీయన. మరి ఒకవైపు సగటు తెలంగాణపౌరులు నిజాం పాలనను వ్యతిరేకించే నేపథ్యంలో... ఆ నియంతృత్వ విధానాలను తప్పు పట్టే తరుణంలో... టీఆర్ఎస్ వాళ్లు మాత్రం నిజాం ఇమేజ్ ను పెంచడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ మాత్రమే కాకుండా... టీఆర్ఎస్ లోని నేతలంతా ఈ ప్రయత్నాలతోనే బిజీగా మారేటట్లు ఉన్నారు. మరి ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో జరుగుతున్న రాజకీయాలు అనుకోవచ్చు. నిజాంను కీర్తించడం ద్వారా.. హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున్న ఉన్న ముస్లిం ఓట్లకు గాలం వేసే ప్రయత్నం కావొచ్చు. మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: