కొద్ది వారాల్లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గత కొద్దిరోజులుగా బిజెపి-శివసేన, కాంగ్రెస్‌-ఎన్‌సిపి కూటమిల సర్దుబాట్లు, ఒంటరిపోరు తదితర అంశాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే, తాజాగా మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో ముంబయి, పూణేతో కూడిన ముంబయి మెట్రోపాలి టన్‌ రీజియన్‌, నాసిక్‌ ప్రాతినిథ్యం వహి స్తున్న 'స్వర్ణ త్రిభుజి' జోన్‌లో గెలుపు సాధించే దిశగా ప్రస్తుతం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. స్వర్ణ త్రిభుజిని దక్కించుకోవడం రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షలా మారింది. ఇది ఆర్థికంగా ఎంతో ప్రగతిపథంలో ఉన్న ప్రాంతమైనందున, ఈ కోటలో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలన్నీ ఉవ్వి ళ్ళూరుతున్నాయి. 5జిల్లాల వ్యాప్తంగా 14 పార్లమెంటరీ నియోజకవర్గాలు, మూడు ప్రధాన నగరాలు, సాటిలైట్‌ టౌన్‌షిప్పులు, 77శాసనసభా స్థానాలతో ఏర్పడిన ఈ స్వర్ణ త్రిభుజి ప్రాంతం దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన, పట్టణీకరణ ప్రాంతా లను ఇముడ్చుకుంది. దాదాపు 90శాతం అసెంబ్లీ స్థానాలు అత్యున్నతంగా పట్టణీ కరణ చెందాయి. 63శాతం ముంబయి, మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఉన్నాయి. ఈ త్రిభుజి వ్యూహాత్మకంగా నిర్మితమైంది. ముంబయి, దాని మెట్రోపాలిటన్‌ ప్రాంతం, కొంకణ్‌ బెల్ట్‌లోకి చొచ్చుకు వచ్చిన ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్‌, అక్కడినుంచి రాష్ట్రంలోని పశ్చిమ ప్రాం తంలో భాగమైన పూణే, దాని మెట్రో పాలిటన్‌ ప్రాంతం దీనిలో భాగమే. అయితే, దేశ ఆర్థిక రాజధాని ముంబయి, శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న పూణే మెట్రోలో ఐటి రంగం విజృంభిస్తున్నందుకు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా, నాసిక్‌ కూడా రాష్ట్రంలో అత్యంత శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరాల్లో ఒకటిగా రూపాంతరం చెందు తోంది. ఇది ముంబయి-పూణేతో అను సంధానమైన మంచి నగరంగా ఉంది. స్వర్ణభుజి అత్యుత్తమ విశిష్ఠతల ప్రత్యేక సమాహారంగా పేరొందింది. 2009 శాసనభ ఎన్నికల్లో స్వర్ణ త్రిభుజి జోన్‌లోని 77స్థానాలకుగాను కాంగ్రెస్‌-ఎన్‌సిపి కూటమి 33స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాగా, బిజెపి-శివసేన కూటమి 24 సెగ్మంట్లకు పరిమితమైంది. కాంగ్రెస్‌ 23సీట్లలో విజయం సాధించగా, శివసేన 13స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ఎన్‌సిపి, అప్పటి యుపిఎ జూనియర్‌ అలవెన్స్‌ భాగస్వామిగా ఈ ప్రాంతంలో 10సీట్లను దక్కించుకుంది. బిజెపి, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేనా 11సెగ్మంట్లను కైవసం చేసుకుంది. కాగా, ఈ సారి పంచముఖ పోటీ నెలకొంది. శివసేన, కాంగ్రెస్‌ పార్టీలు తమ స్థానాలను నిలబెట్టుకొని గట్టెక్కడం చాలా కష్టంతో కూడుకున్న పనే. ముంబయి, దాని శివారు లోని 36 స్థానాల్లో గత శాసనసభ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ మంచి పట్టు సాధించింది. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన ఆరు స్థానాలను గెలుచుకోగా, బిజెపి 5స్థానాల్లో విజయం సాధించింది. అక్టోబర్‌ 15న జరుగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఎన్‌సిపి హోరాహోరీగా తలపడుతున్నాయి. సీట్ల పంపకం కుదరని కారణంగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. మరోవైపు బిజెపి-శివసేన కూటమి కూడా తమ 25ఏళ్ళ కూటమి బంధాన్ని తెంచుకుంది. ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఐదు చిన్న టౌన్‌షిప్‌లతో దేశ రాజధాని ముం బయి ఆర్థికవ్యవస్థకు సంధానించబడింది. ఇదిలాఉంటే, ముంబయి పన్వెల్‌, ఉరన్‌, కర్‌జత్‌ శివార్లతో విస్తరించబడింది.ఇక్కడ అత్యధికసంఖ్యలో రైతులు, కార్మికులు ఉన్నారు. కర్‌జత్‌ లోక్‌సభ ఎన్నికల్లో శివసేన లబ్ధి పొందింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పన్వెల్‌ను గెలుచుకోగా, ఎన్‌సిపి కర్‌జత్‌ను, పిడబ్ల్యూపి ఉరన్‌ స్థానాన్ని గెలుచుకున్నాయి. మహారాష్ట్ర రాజధాని సాంస్కృతిక పట్టణంగా పేరొందిన పూణే లో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 10అసెంబ్లీ స్థానాలు విస్తరిం చాయి. స్వర్ణ త్రిభుజిలోని నాసిక్‌లో నాలుగు స్థానాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: