తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాత్క లికంగా బ్రేక్‌ వేసినట్లు తెలిసింది. ఇటు పార్టీ అటు ప్రభుత్వం సవ్యంగా సాగించాలనే వుద్దే శ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా త్వరలో నిర్వహించనున్న అసె ంబ్లీ సమావేశాలతో పాటు పార్టీ విసృత్తస్థాయి సమావేశంలో నేపథ్యంలో మంత్రివర్గ విస్తర ణకు సీఎం వాయిదా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లీనరీ తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకమైన మార్పులు తీసుకోవాలని రావాలని భావించిన సీఎంకు పరిస్ధి తులు అనుకూలించలేదు. దీంతో ప్లీనరీ వాయిదా పడడంతో కనీసం మంత్రివర్గాన్ని విస్తరిచాలనుకున్నారు. అది కూడా సాధ్యం కాదని తెలుసుకున్న సీఎం నేరుగా అసెంబ్లీ సమావే శాల నిర్వహణపై దృష్టి పెట్టారు. మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి, ఎవరికి ఉద్వాస న పలకాలనే దానితో పాటు పాత, కొత్త కలయిల వల్ల ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వం లోనూ కొంత గందరగోళం నెలకొనే ప్రమాదముందని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ ఈ మేర కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నా... పదవు లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్‌ దీనిపై నిర్ణయ ం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ని రకాలుగా సమాలోచనలు జరిపినా... మంత్రివర్గాన్ని ఇప్పట్లో విస్తరించడం అంత సరికాదనే సీఎం ఒక స్పష్టమైన నిర్ణ యానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణతో పాటు పార్టీ ప్లీనరీ సమావేశాలను ఒక దాని తర్వాత ఒకటి నిర్వహించే అంశంపై చర్చలు జరుపుతున్నారు. దీనివల్ల పార్టీ నేత లతో పాటు కార్యకర్తల్లోనూ కొంత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లోపుగా ప్రభుత్వం నామినేటేడ్‌ పదవులను పంపకాన్ని పూర్తిచేస్తే మంత్రివర్గాన్ని విస్తరిస్తరించడం శ్రే యస్కరమని సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్యులు, తెలంగాణ మేధావులు సైతం ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే సరైన నిర్ణయమనే దోరణిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధి ంచి కేసీఆర్‌ పలువురు రాజకీయ విశ్లేషకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది. దీని పై ఇటీవల పత్రికల్లో పలు రకాల కథనాలు వెలువడినా... అవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెరాస వర్గాలు అభిప్రాయపడుతుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: