విశాఖపట్నం ఇమేజీని ఎవరూ దెబ్బ తీయలేరని ఎపి మంత్రులు నారాయణ,పల్లె రఘునాధరెడ్డి,గంటా శ్రీనివాసరావు లు అన్నారు. విశాఖ తుపాను బీబత్సం నుంచి కోలుకుని యదావిధిగా అబివృద్ది చెందుతుందని వారు అన్నారు. విశాఖను ఐటి,విద్య, పరిశ్రమల రంగాలలో అబివృద్ది చేస్తామని మంత్రి గంటా అన్నారు. తుపాను సమయంలో అధికారులు, మంత్రులు అంతా కలిసి పని చేయడం ఓ రికార్డుగా మత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యానించారు.అబివృద్ది చెందిన ఏ దేశంలో కూడా ఇలా జరగలేదని ఆయన అబిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తితోనే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.అధికారులు, మంత్రులు అంతాకలసి చాలా తక్కువ సమయంలో తుపాను ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ద్వారా మాములు స్థితికి తీసుకువచ్చామని ఆయన అంటున్నారు. అయితే ఉత్తరాంద్రలో ఎనభై శాతం విద్యుత్ సరఫరా పునరుద్దరించామని ఆయన తెలిపారు.తుపాను నష్టానికి గురైన ఐటి కంపెనీలకు రాయితీలు ఇస్తామని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: