లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడమే ఆ ఓటమిలో హైలెట్. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కోసం కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే కనీసం పదో శాతం సీట్లను కూడా సాధించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ అర్హత లేనేలేదని లోక్ సభ స్పీకర్ స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. మరి ఇప్పుడు మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కినట్టేనా? లేక అక్కడ కూడా దక్కడం లేదా? అనేది అర్థం కావడం లేదు! కాంగ్రెస్ పార్టీ కి 40 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. విశేషం ఏమిటంటే ఎన్సీపీ కూడా దాదాపు ఇన్నే స్థానాల్లో విజయం సాధించింది. ఎలాగూ శివసేన అధికార పక్షంలో భాగస్వామి అయ్యింది కాబట్టి కాంగ్రెస్ , ఎన్సీపీల్లో ఎవరో ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలవాల్సి ఉంది. అయితే ఇక్కడే ఒక చిక్కు సమస్య ఉంది. కాంగ్రెస్ ,ఎన్సీపీల తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు జెండా పీకేసే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ , ఎన్సీపీలపై ఆకర్ష వల విసిరే అవకాశం ఉంది. మరి ఆ వలలో చిక్కుకుపోయే వారు గాక.. మిగిలేది ఎంతమంది? అనేదాన్ని బట్టి మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎవరు? అనేదానిపై క్లారిటీ వస్తుంది. మరి కాంగ్రెస్ , నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ ల్లో ఎవరు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకొంటే వాళ్లే ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు అర్హత సాధిస్తారు. మరి ఆ దమ్ము ఎవరికి ఉందో

మరింత సమాచారం తెలుసుకోండి: