నల్లడబ్బు నుంచి విదేశాల నుంచి తెప్పించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ బీజేపీ మాజీ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది జెఠ్మలానీ మండిపడ్డారు. అంతేకాదు, నల్ల కుబేరుల విషయంలో జైట్లీ నిజాలు దాస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని జెఠ్మలానీ ఆరోపించారు. దీనిపై ఆయన నేరుగా జైట్లీకే మూడు పేజీల లేఖాస్త్రం సంధించారు. ‘‘నల్లధనంపై నిజాలు బయటపెట్టడం మీకు ఇష్టంలేదు. మోదీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారనే సంకేతాలు పంపేందుకే ఇలా చేస్తున్నారు. మోదీ అంటే మీకు గిట్టదు. ఆయన ప్రధాని కావడం ఇష్టంలేదు. ప్రధాని పీఠంపై మీరు కన్నేశారు. మీరు ఇటీవలే ఆస్పత్రిలో చేరి మృత్యువు కోరల నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆ తర్వాతైనా నైతికతతో ప్రవర్తించి ఉంటే బాగుండేది’’ అని జెఠ్మలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్లధనం విషయంలో జైట్లీ తీరు దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. ‘ద్వంద్వ పన్నులను నివారించే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లవుతుంది కాబట్టే నల్లధనం దాచుకున్న వారి పేర్లను బయటపెట్టడంలేదు’ అని జైట్లీ చేసిన వాదనను జెఠ్మలానీ తప్పుపట్టారు. జర్మనీ ఎప్పుడూ ఈ ఒప్పందం గురించి మాట్లాడలేదని, నల్ల కుబేరుల గురించి ఎలాంటి సమాచారం ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్‌పై ఆర్థిక మంత్రికి ఎవరో తప్పుడు సలహా ఇచ్చారని అభిప్రాయపడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: