ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు? మద్రాస్ స్టేట్ నుంచి కర్నూలు రాజధానిగా రాష్ట్రం ఏర్పడిన దినమే ఏపీ అవతరణ దినోత్సవం అవుతుందా? లేక హైదరాబాద్ స్టేట్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడినప్పుడు అవుతుందా?! లేక తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసిన తర్వాత మిగిలిన సీమాంద్ర సహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజే ఏపీ అవతరణ దినోత్సవం అవుతుందా?! ఈ విషయంపై ఏపీ అధికారులకు ఇప్పటి వరకూ క్లారిటీ రావడం లేదు. మూడు రోజుల్లో దేన్ని ప్రస్తుత ఆంధ్ర్రదేశ్ అవతరణ దినోత్సవం అనుకోవాలి?! అంటూ వారు దర్మసందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎ ప్పుడో క్లారిటీ రావాల్సింది. అయినప్పటికీ రాలేదు. అప్పుడెప్పుడోనో... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఈ ఫైలు వెళ్లిందట. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలి? అనే అంశం గురించి నిర్ణయాధికారాన్ని ఆయనకే అప్పజెప్పారట ఏపీ అధికారులు. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో అధికారిక ప్రకటన రావడం లేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే బాబు మాత్రం ఈ విషయంలో ఇంత వరకూ క్లారి టీ ఇవ్వలేదు. అయితే నవంబర్ ఒకటో తేదీ దగ్గరపడుతోంది. ఆ తేదీలోపు తమకు ఏదో ఒ క్లారిటీ ఇవ్వాలని అదికారులు కోరుతున్నారు. ఏర్పాట్లు చేసుకోవడానికి వారు ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి ఏమనుకొంటున్నారో!

మరింత సమాచారం తెలుసుకోండి: