తెలుగుదేశం యువ నాయకుడు లోకేష్ తెలంగాణను ఉత్తర కొరియాతో పోల్చారు.ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్య చేశారు.తెలంగాణలో 2019 నాటికి టిఆర్ఎస్ కు భవిష్యత్ ఉండదని ఆయన జోస్యం చెప్పారు.కెసిఆర్ కు విజన్ లేదని, ఆయన ద్వేషం పెంచడానికే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.కెసిఆర్ ను విమర్శించే హక్కు తనకు ఉందని అంటూ,టిఆర్ఎస్ పార్టీ వారు ఇతర పార్టీ ఆఫీస్ లపై దాడులు చేయాలని ఎస్.ఎమ్.ఎస్ లు ఇస్తున్నారని అన్నారు.ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ద్వేషం పెంచడానికి ప్రయత్నించినవారు ఎప్పుడూ అభివృద్ది చెందలేదని ఆయన చెప్పారు. ఉదాహరణకు ఉత్తర కొరియా ఎప్పుడూ దక్షిణ కొరియా కు వ్యతిరేకంగా విద్వేషాలు నూరి పోస్తుందని, కాని దక్షిణ కోరియా మాత్రం ద్వేషం లేకుండా అబివృద్దిపైనే దృష్టి పెట్టిందని లోకేష్ ఉదహరించారు.హైదరాబాద్ లో అబివృద్ది వేగం మందగించిందని లోకేష్ వ్యాఖ్యానించారు. నేరుగా తెలంగాణ ,ఉత్తర కొరియా ఒకటే అని చెప్పకపోయినా, ఉదహరణ ఇవ్వడం ద్వారా లోకేష్ ఏమి చెప్పదలిచింది అర్ధం అవుతూనే ఉంది !

మరింత సమాచారం తెలుసుకోండి: