తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అందరికీ కావాల్సిన వ్యక్తి అని.. ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని.. దీని వల్ల కొంతమందితో సంబంధాలు చెడిపోతాయని అంటున్నారు తమిళనాడు కాంగ్రెస్ నేతలు. రజనీకాంత్ ఇలా అందరితోనూ సంబంధాలు చెడగొట్టుకొనే రాజకీయాల్లోకి రావడం కన్నా సైలెంట్ ఉండటం మేలు అని కూడా వారు అంటున్నారు. విశేషం ఏమిటంటే.. ఇదే సమయం లో వారు రజనీని తమ పార్టీలోకి రావాలని కూడా పిలుస్తున్నారు. రజనీకాంత్ వస్తే తమ పార్టీలోకి రావాలని.. ఇతర పార్టీల్లోకి వెళ్లడం మాత్రం సరికాదు అని తమిళ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్లే ఉద్దేశంతో ఉన్నట్టు అయితే అసలు రాజకీయాల్లోకి రాకూడదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధమైన చోద్యంతో మాట్లాడుతున్నారు తమిళ కాంగ్రెస్ నేతలు. అలాగే తమిళనాడులో కొత్తగా ఏర్పడుతున్న జీకే వాసన్ పార్టీ కూడా రజనీమీద బోలెడు ఆశలు పెట్టుకొంది. వాసన్ పునరుద్ధరించనున్న తమిళ మూపనార్ కాంగ్రెస్ లోకి రజనీని ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ కి రజనీమీద ఆశలున్నాయనేది తెలిసిన విషయమే. రజనీ ఓకే అంటే.. ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగాప్రకటించి రంగంలోకి దిగడానికి కమలం పార్టీ రెడీగా ఉంది. అయితే రజనీ నుంచి మాత్రం ఏం క్లారిటీ లేదు. డిసెంబర్ 12 న పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఏదో ఒకటి తేలుస్తాడని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: