విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో స్వయంగా అధ్యక్షుడు చంద్రబాబు కూడా పాల్గొన్నాడు. పార్టీ , ప్రభుత్వ అధినేతగా ఉన్న ఆయన ఈ సమావేశానికి హాజరై తన ముందున్న లక్ష్యాలను వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొంటామని ఆయన చెప్పాడు. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు గడిచినా, తను ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకూ తొలిసంతకాల గురించే ఆయన మాట్లాడటం విశేషం. అయితే రుణమాఫీ చేస్తామని ఆయన అంటున్నాడు. ఎక్కడా వెనక్కు తగ్గే ప్రసంగాలు అయితే చేయలేదు. తాజాగా ఏదో గడువు చెప్పి... రుణమాఫీ జరుగుతుందని ఆయన ప్రసంగించాడు. మరి ఈ సంగతి ఇలా ఉంటే... ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. పార్టీ విస్తృతస్థాయి సమావేశం పేరుతో జరిగిన ఈ మీటింగ్ కు మొత్తం 113 మంది నేతలు హాజరు కాలేదట! 13 జిల్లాల పరిధిలోని నేతలతో జరిగిన ఈ సమావేశానికి ఇంత మంది నేతలు రాకపోవడం, స్వయంగా పార్టీ అధినేత హాజరైన సమావేశం పట్ల వారు ఆసక్తి చూపకపోవడం విశేషమే. మరి కారణాలు ఏమిటి అనేది కూడా అర్థం కావడం లేదు. డిప్యూటీసీఎం ఒకరు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మరి అధికార పార్టీ సమావేశం అంటే నేతలు ఎగబడి వస్తారు. ఇలాంటి మీటింగ్ పాల్గొనడం గొప్ప గుర్తింపుగా భావిస్తారో. ఏ ప్రతిపక్ష పార్టీ మీటింగ్ అయితే గైర్హజరీల సంఖ్య ను లెక్కబెట్టాలి. అయితే తెలుగుదేశం పార్టీ మీటింగ్ కూడా గైర్హాజరీలను చర్చనీయాంశంగా మార్చడం ఏమిటో

మరింత సమాచారం తెలుసుకోండి: