ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణం మొత్తం ప్రకాశంబ్యారేజి నుండి 20 కిలోమీటర్ల నిడివిలోనే ఉండేలా ముఖ్యమంత్రి ప్రణాళికలు రచిస్తున్నారు. కృష్ణానదికి ఇవతలి వైపు అంటే గుంటూరు జిల్లా వైపునున్న వెంకటాయ పా ళెం, తాళాయపాలెం పొడవునా ఉంటుందని తెలిసిం ది. ప్రకాశం బ్యారేజి నుండి 20కిలోమీటర్ల పొడువు నా అతిపెద్ద గార్డెన్‌న్ను అభివృద్ది చేసిన తర్వాత అం దులోనే రాజధానికి అవసరమైన అన్నీ నిర్మాణాలూ వుండేలా ముఖ్యమంత్రి బ్లూ ప్రింట్‌ రూపొందించిన ట్లు తెలిసింది.అయితే, ముఖ్యమంత్రిక్యాంపు కార్యా లయం మాత్రం కృష్ణా నదికి ఆవతలి వైపు అంటే కృష్ణాజిల్లా వైపు సుమారుగా గుంటుపల్లి, గొల్లపల్లి ప్రాంతంలో ఉండవచ్చని సమాచారం. సచివాలయం, రాజ్‌భవన్‌, శాసనసభ, అన్నీ ప్రభుత్వ కార్యాలయాతో పాటు సమస్త విభాగాధిపతుల కార్యాలయాలు తదితరాలన్నింటినీ గుంటూరు జిల్లా వైపు నిర్మించనున్న ముఖ్యమంత్రి, సిఎం క్యాంపు కార్యాలయాన్ని మాత్రం కృష్ణాజిల్లా వైపు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవటం గమనార్హం. రాజధాని నిర్మాణానికి సంబంధించిన విధివిధానాలు మొత్తం ఇటీవలి సింగపూర్‌ పర్యటనలోనే ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు తెలిసింది. 30 వేల ఎకరాల్లో ఏవి ఎక్కడ నిర్మించాలన్న విషయాలను కూడా సిఎం సింగపూర్‌ ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి తన మనసులోని మాటను చంద్రబాబు సింగపూర్‌ ప్రభుత్వం ముందుంచి అందుకు తగ్గట్లుగానే రాజధాని ప్రణాళికను రూపొందించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. అదేవిధంగా సింగపూర్‌ ప్రభుత్వం కూడా ఆ దేశంలోని ప్రఖ్యాత నిర్మాణ సంస్ధలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే సింగపూర్‌లోని సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ను ముందుగా రాషా్టన్రికి పంపుతున్నది. అలాగే, రాజధాని నిర్మాణం కోసం సేకరించనున్న 30 వేల ఎకరాల్లో సుమారు 7 వేల ఎకరాలు తిరిగి రైతులకే అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి 6 వేల ఎకరాలు, రోడ్లు, వీధి దీపాలు, భూ గర్భడ్రైనేజి తదితరాలకోసం మరో 6 వేల ఎకరాలు, పార్కులు, వాణిజ్య, వర్తక, వినోద కేంద్రాలతో పాటు నివాస భవనాల కోసం మరో 6 వేల ఎకరాలు కేటాయించినట్లు తెలిసింది. మిగిలిన 5 వేల ఎకరాలను రాజధాని నిర్మించనున్న నిర్మాణ సంస్ధ యాజమాన్యానికి శాస్వత ప్రాతిపదికన కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ 5 వేల ఎకరాలను సదరు సంస్దకే పూర్తిస్దాయి యాజమాన్య హక్కులను బదలాయించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర అవసరమైన నిర్మాణాలను సైతం ఏ సంస్ద అయితే చేపడుతుందో అదే సంస్దకు ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ నిర్మించుకునే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారు. సదరు సంస్ధకు కేటాయించనున్న 5 వేల ఎకరాల్లోనే ఆ సంస్ధ మొత్తం వినోద, వాణిజ్య, వర్తకానికి అవసరమైన నిర్మాణాలతో పాటు కొంత నివాస భవనాలను కూడా నిర్మించుకుంటే రాజధాని కోసం చేస్తున్న పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. అంటే, రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన నిర్మాణ సంస్ధలతో ఒక విదంగా అభివృద్ది ప్రాతిపదికన అవసరమైన ఒప్పందాలు చేసుకుంటుందన్న మాట. దీని వల్ల రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన పెట్టుబడి లేకుండానే మొత్తం పని పూర్తి చేసుకోవాలని యోచిస్తున్నది. అయితే, సదరు కాంట్రాక్టిగ్‌ సంస్ధకు మాత్రం 30 వేల ఎకరాలను సేకరించిన తర్వాతనే పూర్తి భూమి అప్పచెబుతుంది. అందుకయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మొత్తం రాజధాని నిర్మాణానికి సుమారు రూ. 4 లక్షల కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ. లక్ష కోట్లు మౌళిక సదుపాయాల కల్పన తదితరాలకే అవుతుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: