నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో తొలిసారిగా ఓ జాతీయస్ధాయి టోర్నీ జరగనుంది. ఇందిరాగాంధీ పురపాలక స్టేడియం వేదికగా 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 3 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో తలపడనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన జాతీయ స్ధాయి టోర్నీల్ని ఏపీ దక్కించుకుంటోంది. విభజన తర్వాత తొలిసారిగా విజయవాడ వేదికగా జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ జరగనుంది. ఐదురోజులపాటు సాగే టోర్నీలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీల్లో విజేతలు పాల్గొంటున్నారు.                                  షార్ట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. నగరంలో తొలిసారి జరుగుతున్న జాతీయస్థాయి టోర్నీ కావడం వల్ల ముమ్మర ఏర్పాట్లు చేశారు. కొత్తగా అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేయడం సహా స్టేడియాన్ని రంగురంగుల జెండాలతో ముస్తాబు చేశారు. టోర్నీలో పాల్గొనేందుకు క్రీడాకారుల వసతి కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.             క్రీడల నిర్వహణలో ఏపీ సీఎంకు మంచి అనుభవం ఉంది. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో గచ్చిబౌలిలో నేషనల్ గేమ్స్ జరిగేలా చొరవ తీసుకున్నారు. అప్పట్లో ఈ క్రీడలతో హైదరాబాద్ లో మంచి క్రీడాసదుపాయాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించి ఏపీలోమరింత సుందర నగరంగా తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ఈ క్రీడల సమర్థ నిర్వహణ ద్వారా క్రమంగా ఆధునిక గుర్తింపు తెచ్చుకొని.. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మారుస్తానని ఆయన చాలాసార్లుచెప్పారు. క్రమంగా ఆటలకూ గుర్తింపు పెరుగుతోంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ కూడా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: