తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ హాల్ ను రీ డిజైన్ చేయించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సభలోనే ఈ అంశం గురించి చర్చించారు. శాసన సభలో సీటింగ్ అరేంజ్ మెంట్ లో మార్పు తీసుకురావాలని... ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మార్పు చేయాలని సభికులు నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ శాసన సభలో 120 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే వీరు సమావేశం అయ్యే హాల్ మాత్రం 300 మంది కూర్చోవడానికి అనుగుణంగా ఉంటుంది. వెనుకటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలకు ఉపయోగించిన హాల్ నే ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. అయితే 300 మంది కూర్చోవడానికి అనుగుణంగా ఉన్న హాల్ లో 120 మంది మాత్రమే కూర్చొంటుండటంతో చాలా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దాదాపు 60 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ 120 మందిలో కూడా గైర్హజారీలు, సస్పెన్షన్లు ఉండనే ఉంటున్నాయి. దీంతో సభకు మొత్తంగా కళ తప్పుతోంది. ఒకప్పుడు 294 మంది సభ్యులతో నిండుగా కనిపించిన సభ ఇప్పుడు వంద, అంతలో పు మంది సభ్యులతో నిండుతనాన్ని కోల్పోతోంది. తెలంగాణ శాసనసభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీటింగ్ అరేంజ్ మెంట్ మార్చాలని... ఖాళీ సీట్లు తొలగించి.. సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అరేంజ్ మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ మార్పుతోనైనా.. టీ.శాసనసభకు నిండైన కళ వస్తుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: