ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తాజాగా ఒక సినిమాటిక్ డైలాగ్ పలికాడు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం పోరాడతామని చెబుతూ రాహుల్ గాంధీ సినిమా హీరో డైలాగ్ చెప్పాడు. ఢిల్లీలోని ఒక మురికివాడలోని వారి తరపున మాట్లాడుతూ రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని చేశారు. ఢిల్లీలోని ఒక మురికి వాడ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు దాదాపు తొమ్మిది వందల ఇళ్లను కూల్చివేశారు. అక్రమంగా కట్టుకొన్నారని చెబుతూ అధికారులు బుల్డోజర్లను ఉపయోగించి వాటిని కూల్చివేశారు. వారిని రాహుల్ గాంధీ పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మరోసారి బుల్డోజర్లు ఉపయోగిస్తే... అవి తన మీదే దూసుకు వెళ్లాలని రాహుల్ వ్యాఖ్యానించాడు. చలికాలం అని కూడా చూడకుండా.. ముందస్తు నోటీసులు ఏమీ లేకుండా ఇళ్లను కూల్చేశారని రాహుల్ అన్నాడు. మరి మానవతా దృక్పథం ప్రకారం చూస్తే.. అధికారులు కనీసం జాలి కూడా చూపలేదని అనిపిస్తుంది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వందల ఇళ్లను కూల్చివేయడం దారుణమని చెప్పవచ్చు. ఈ విషయంలో వారి తరపున కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం చేస్తే అది మంచిదే. అయితే సినిమాటిక్ డైలాగులు మాత్రం కొంచెం చోద్యమనిస్తాయి. బుల్డోజర్లు మళ్లీ వస్తే.. అవి తన మీద దూసుకొని వెళ్లాలని, వాటిని తను అడ్డుకొంటానని రాహుల్ చెప్పడం కొంచెం అతిగా ఉంది. మరి సాయంత్రానికి తన దారిని తను వెళ్లిపోయిన పెద్దమనిషి అలా మాట్లాడటం ఓవర్ కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: