ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్మ్ హౌస్ వద్ద రోడ్డు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించడంతో ఆయనే స్వయంగా రోడ్డు వేసుకుంటున్నారు..చంద్రబాబు కుటుంబానికి మజీద్ బండ వద్ద పది ఎకరాల స్థలం లోకేష్ ,భువనేశ్వరిల పేరుతో ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ఫాంహౌస్ లోకి తాత్కాలికంగా మారాలని చంద్రబాబు కుటుంబం భావించింది.మొదట లేక్ వ్యూ అతిధి గృహంలోకి మారాలని ప్రతిపాదన వచ్చినా, కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు.దాంతో వారు పార్మ్ హౌస్ కు మారాలని అనుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటిని తీసివేసి కొత్త ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. ఫార్మ్ హౌస్ కు మారడానికి వీలుగా అక్కడ అదనపు గదుల నిర్మాణం చేయ సంకల్పించారు.అయితే ఆ ప్రదేశం వద్ద రోడ్డు లేదు.ఇక్కడే కాకుండా , మరో రెండు కాలనీలకు కూడా రోడ్డులేదు.దీనిపై టిడిపి కార్పొరేటర్లు శ్రీనివాసరెడ్డి తదితరులు రోడ్డు కోసం ప్రతిపాదన చేయగా,అది స్టాండింగ్ కమిటీ లో ఆమోదం కూడా పొందింది.కాని ఆ తర్వాత ప్రభుత్వ స్థాయిలో ఆగిపోయింది. ఎపి ముఖ్యమంత్రి పామ్ హౌస్ కు తెలంగాణ ప్రభుత్వం రోడ్డు వేయవలసిన అవసరం లేదని ప్రభుత్వవర్గాలు భావించాయి.ఈ రోడ్డుకు సుమారు కోటిన్నర ఖర్చు అవుతుందని అంచనా.ఈ నేపధ్యంలో చంద్రబాబు సొంతంగానే రోడ్డు వేసుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: