జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడి తరువాత 14 ఏళ్లలో 10 ప్రభుత్వాలు మారడంతో రాజకీయ అనిశ్చితి అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రంలో ఐదు దశల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ అనిశ్చితి గురించే అక్కడి ఓటర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తన ప్రచార సభల్లో ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. పుష్కలంగా వనరులు ఉన్నా రాష్ట్రం అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం అదేనని స్పష్టం చేస్తున్నారు. ఇతర పార్టీలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఒకటి ఒకటిన్నర సంవత్సరాలకే ఎందుకు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తోంది అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో ఉదయిస్తోంది. రాష్ట్రంలో సంస్థాగత అభివృద్ధి జరగకపోవడమే దీనికి కారణమని జార్ఖండ్‌లో మూడు సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా అభిప్రాయపడు తున్నారు. కార్సావన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ముండా చెప్పిన అభిప్రాయా న్నే గట్టిగా సమర్థిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా, పంచా యతీ ప్రణాళికలను అమలు చేయాలంటే ఒక విధానం అంటూ అవసరమని, విధానాన్ని అమలు పరచాలంటే అభివృద్ధి చెందిన సంస్థలు అవసరమని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇది కష్టసాధ్యమవుతోందని తెలిపారు. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎజెఎస్‌యు పార్టీ అధ్య క్షుడు, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలతో పనిచేసిన సుధేశ్‌ మహతో నాయకత్వంలో నిలకడ లేక పోవడం వల్లే రాజకీయ అనిశ్చితి నెలకొంటోందని అభిప్రాయపడుతున్నారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి 23 నెలలు సారథ్యం వహించిన ముధు కోడా ప్రాంతీయ పార్టీలదే తప్పని చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలను ఒత్తిడికి గురిచేయడం వల్లే అవి మనుగడ సాధించడం లేదని తెలిపారు. కోడాతో పాటు ఆయన ప్రభుత్వం లో పనిచేసిన వివిధ పార్టీలకు చెందిన మంత్రులు కొందరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు వివిధ అవినీతి కేసుల్లో జైలు శిక్షలు అనుభవించి బెయిల్‌పై బయ టికి వచ్చారు. వారిలో ఎన్‌సిపికి చెందిన కమలేష్‌ సింగ్‌, నవజవాన్‌ సంఘర్ష్‌ మోర్చాకు చెందిన భానుప్రతాప్‌ పాహిల భవితవ్యం తొలిదశ పోలింగ్‌ పూర్తయిన ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. రాజకీయ సంక్షోభానికి భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలే కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. రాజకీయ, సాంస్కృతిక భిన్నత్వం ఉన్న చోట ఒకే పార్టీకి అధికారం ఇవ్వడం సాధ్యపడే విషయం కాదని అంటున్నారు. జెఎంఎం, ఎజెఎస్‌యు వంటి ప్రాంతీయ పార్టీలకు సొంత ఓటుబ్యాంకులు ఉన్నాయని రాంచీ విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగం ఆచార్యులు రమేష్‌ శరణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశా రు. ఓటు వేసే విధానమే అనిశ్చితికి కారణమని జియాలజిస్ట్‌ నితిష్‌ ప్రియదర్శి అంటున్నారు. వివిధ పార్టీలు వివిధ రకాలుగా ప్రజలను ప్రభావితం చేయడమే అసలు కారణమని రాంచీ సైకాలజీ విభాగం ఆచార్యులు సహీద్‌ హస్సన్‌ అభిప్రాయపడుతున్నారు. ఒక గిరిజనుల గురించి మరో పర్టా దళితులు, ఇంకో పార్టీ మైనార్టీల గురించి ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ ఎన్నికలైనా రాష్ట్రానికి కొత్త చరిత్రను లిఖిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: