గత ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంటరయ్యారు పవన్. జనసేన పార్టీ పెట్టి టీడీపీ-బీజేపీకి పూర్తి సపోర్ట్ అందించారు. అంతేకాదు.. కాంగ్రెస్ హఠావో-దేశ్ బచావో నినాదాన్ని వినిపించారు. తన ప్రతి ఎన్నికల సభలో ఇదే స్లోగన్ ను వినిపించారు. ఇప్పుడిదే స్లోగన్ ను కొంచెం మార్చాడు రచయిత బొగ్గులశ్రీనివాస్. పవన్ కల్యాణ్ హఠావో-పాలిటిక్స్ బచావో అనే పుస్తకాన్ని రాశాడు. హైదరాబాద్ తార్నాకకు చెందిన శ్రీనివాస్ ఎన్నికల సమయంలో పవన్ ఎన్నిసార్లు మాట మార్చారు.. నిలకడలేని వాగ్దానాలు ఎన్ని ఇచ్చారు.. అసలు పవన్ ను, అతడి పార్టీని నమ్మొచ్చా అంటూ విశ్లేషణాత్మకంగా, ఫొటోలతో సహా ఈ పుస్తకం రాశారు. ఈనెల 26 నుంచి జరగనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి విక్రయించనున్నారు కూడా. ఇదిలా ఉండగా, పవన్ కు వ్యతిరేకంగా పుస్తకం రాశాను కాబట్టి పవన్ అభిమానులు తనపై దాడి చేసే ప్రమాదముందని భయపడుతున్నాడు బొగ్గు శ్రీనివాస్. అందుకే తనకు రక్షణ కల్పించాల్సిందిగా తెలంగాణా ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. వెంటనే హోం మంత్రి నాయిని స్పందించారు. శ్రీనివాస్ కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుస్తక ప్రదర్శనలో కూడా పూర్తి బందోబస్తు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: