దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా సాగుతున్న బీజేపీ, తన యత్నాలను ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలను గెలుచుకునే దిశగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు రాజధాని చెన్నై వచ్చిన ఆయన శనివారం నాటి బహిరంగసభలో తమిళుల మనసులను దోచుకునే యత్నం చేశారు. తమిళులకు స్వభాషాభిమానం ఎక్కువన్న విషయాన్ని పసిగట్టిన అమిత్ షా, దానినే ఆయుధంగా తీసుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు చెన్నైవాసులకు క్షమాపణలు చెప్పిన అమిత్ షా, ‘‘తమిళం నేర్చుకోవడం ప్రారంభించాను. త్వరలో తమిళంలోనే మాట్లాడతా’’నంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో తన తొలి ప్రసంగంలోనే ఈ తరహాలో తమిళుల మన్ననలను పొందాలని చూసిన అమిత్ షా, ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: