ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ప్రతిపక్షనేత జగన్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. నిన్న మొన్నటివరకూ జగన్ దీక్షను ఏమాత్రం పట్టించుకోనట్టు వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా జగన్ దీక్షను భగ్నం చేసింది. ఆయన్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించింది.  

ఆరోగ్యం క్షీణిస్తుందని.. దీక్ష విరమించాలని పోలీసులు ఆయన వద్దకు వెళ్లి దీక్ష విరమించాలని కోరారు. జగన్ అందుకు నిరాకరించడంతో జగన్ ను బలవంతంగా ఆసుపత్రికి తరలించాల్సివచ్చింది. జగన్ దీక్షను భగ్నం చేయవచ్చని వైసీపీ నేతలు అనుకుంటున్నా.. మంగళవారమే చేస్తారని వారు ఊహించలేకపోయారు. ఎందుకైనా మంచిదని వారు రాత్రంతా వేచి ఉన్నారు. 

పోలీసులు వ్యూహాత్మకంగా తెల్లవారుజామున రావడంతో పెద్దగా ప్రతిఘటించడానికి వీలు లేకపోయింది. పోలీసులు జగన్ ను అంబులెన్స్ లో ఎక్కిస్తుండగా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు జగన్ ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

గవర్నమెంట్ సమగ్ర ఆసుపత్రిలో జగన్ కు పోలీసులు వైద్యం చేస్తున్నారు. ఉదయమే బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి జగన్ దీక్షను భగ్నం చేశారు. జగన్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: