ప్రపంచంలోని అగ్ర  రాజ్యాలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు..ఉదయం లేచిన మొదటు పడుకునే వరకు ఎప్పుడు ఎక్కడ ఏ విద్వంసాలు జరుగుతాయో అని చుట్టూ రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది..అయినా కూడా విద్వంస కాండలు జరుగుతూనే ఉన్నాయి..ప్రపంచాన్ని ముస్లిం మతం వ్యాపించడానికి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఎంతకైనా తెగించే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల కళ్లు మన భారత దేశంపై పడ్డాయి..ఈ సంవత్సరం కాశ్మీర్,గుజరాత్ లో పలుమార్లు ఉగ్రవాదుల దాడులు జరిగాయి..ఈ దాడుల్లో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు.


తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల నేతలే తమకు టార్గెట్ అని, ఆంధ్రలోని కీలక ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ బయటపడిన లేఖ కలకలం సృష్టించింది. విశాఖ ఎయిర్‌పోర్టు సహా శ్రీహరికోట షార్‌ను పేల్చేస్తామంటూ విశాఖ ఎయిర్ పోర్టు అథారిటికి లేఖ అందింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లేఖపై ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతం నుంచి లేఖ వచ్చినట్టు గుర్తించారు. తమకు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయని, షార్‌ను పేల్చేస్తామని హెచ్చరిస్తూ కలకలం సృష్టించిన లేఖతో షార్ అధికారులు ఉలిక్కిపడ్డారు.


విశాఖపట్నం విమానాశ్రయం


షార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లేఖ పంపింది నిజంగా తీవ్రవాదులేనా? లేక ఆకతాయిల పనా? అనే కోణం నుంచి కూడా షార్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపు లేఖ వచ్చింది వాస్తవమేనని, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో ఈ లెటర్ పోస్ట్ అయినట్లు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. అయితే ఈ లేఖలు నారాయణ్ సింగ్, రాకేష్ సింగ్ పేరిట వచ్చిన లేఖ సమాచారాన్ని ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులకు అందించారు.  ఆస్తి తగాదాలో వీరి గత కొంత కాలంగా వీరి మానసిక పరిస్థితి బాగాలేదని  తెలుస్తోందని, అయినా ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్టు లేఖలో పేర్కొనడంతో, ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నామని నిర్మల్ సిఐ జీవన్‌రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: