ప్ర‌తి ఏడాది సినీ తార‌లు ఏదో ఒక అంశంపై క్రికెట్ మ్యాచ్ నిర్వ‌హించ‌డం..అందుకు వ‌చ్చే డ‌బ్బుతో ఏదైనా చారిటీ కోసం వెచ్చించ‌టం చేస్తుంటారు. దీనికి వారు గ‌తంలో హైద‌రాబాద్ లేక విశాఖ‌ప‌ట్నం లేక విజ‌య‌వాడ లు వేదికలు గా చేసుకుని నిర్వ‌హించి, ,వ‌చ్చే డ‌బ్బు తో ప్ర‌జ‌ల అవ‌స‌రాల నిమిత్తం ఉప‌యోగించ‌డం జ‌రుగుతోంది. అంతేకాకుండా ఆయా సినీమాకు సంబందించిన కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌డం ప‌రిపాటి. ఇక‌పోతే.. రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోవ‌డంతో ఇప్పుడు ఎక్క‌డ నిర్వ‌హించాల‌న్న‌ది ఇప్పుడు పెద్ద స‌వాలుగా మారింది. హైద‌రాబాద్ లోనిర్వ‌హిస్తే.. ఆంద్ర్రప్ర‌దేశ్ ప్రాంతం నుంచి వ్య‌త‌రేక‌త వ‌స్తోంది.

ఏపీలో చేస్తారు కానీ తెలంగాణ లో చేయ‌రా అన్న సందేహలు 


ఒక‌వేళ ఆంద్ర ప్రాంతంలోనిర్వ‌హిస్తే తెలంగాణ ప్రాంతంలో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. దీంతో నిర్వ‌హకులు ఎక్కడ నిర్వ‌హించాల‌న్న సంక‌ఠ స్థితి లోకి ప‌డిపోయారు. ఇక‌పోతే తాజాగా రానున్న డిసెంబ‌ర్ లో జ‌రుగ‌నున్న క్రికెట్ మ్యాచ్ ను ఏపీ లోని విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్నట్లు టాలివుడ్ తార‌లు నిర్ణయించారు. ఇదేంది మ‌ళ్లీ.. విజ‌య‌వాడ‌లో అనుకుంటున్నారా కానీ ఇక్క‌డే ఉంది ట్వీస్ట్. విజ‌య‌వాడ లో నిర్వ‌హించే మ్యాచ్ లో వ‌చ్చే డ‌బ్బులు తెలంగాణ రైతుల సంక్షేమం కోసం వేచించాల‌ని నిర్చ‌యించారు. క్రికెట్ మ్యాచ్ విష‌యం ఓకే.. కొంత వ‌ర‌కు ఏపీలో వ్య‌తిరేక‌త పెరిగినా మంచి స‌హ‌స‌మే చేస్తున్నారు. ఇక పోతే సినీమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు ఎక్క‌డ నిర్వ‌హించాలా అన్న‌ది టాలివుడ్ హీరో పెద్ద  స‌మ‌స్య‌గానే మారింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా ఏర్ప‌డ‌టం.. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌తి ఒక్క‌రి ప‌నిని రెండు రాష్ట్రాల కోణంలో చూడ‌టం ఇప్పుడో ప‌నిగా మారింది. ఇది ప్ర‌తి ఒక్క‌రికి ఎంతో కొంత ఇబ్బందిని క‌లిగించే ప‌రిస్థితి. ఏదైనా సినీమా ఆడియో ఫంక్ష‌న్ గ‌తంలో మాదిరి హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తే స‌రిపోవ‌డం లేదు. ఏపీలో కూడా నిర్వ‌హించాల‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. 


ఆదే స‌మ‌యంలో ఏపీలో ఏదైనా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తే ఓహ్.. ఏపీలో చేస్తారు కానీ తెలంగాణ లో చేయ‌రా అన్న సందేహలు సినీమా ద‌ర్శ‌కుల‌కు, హీరోల‌కు పెద్ద  సవాలు గా మారుతోంది. దీంతో ప్ర‌తి విష‌యానికి బ్యాలెన్స్ చేయ‌లేక కిందా మీదా ప‌డిపోయే ప‌రిస్థితి. తాజాగా గా క్రిసెంట్ క్రికెట్ క‌ప్ వ్య‌వ‌హారం చూస్తే ఇలాంటిదే క‌నిపిస్తోంది. ఈ డిసెంబ‌ర్ 13న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న క్రిసెంట్ క్రికెట్ క‌ప్ ను ఏపీలో ర్యాగింగ్ క‌ల్చ‌ర్ పోవాల‌ని దానికి వ్య‌తిరేకంగా ఈ క‌ప్ న‌ను నిర్వ‌హిస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా సేక‌రించే నిధుల్లో రూ.5 ల‌క్ష‌లు తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు. అయితే తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం ఏపీ విజ‌య‌వాడ‌లో వేదిక చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 


ఇది ఇలే ఉంటే.. ఇక సినీమా తార‌ల కార్య‌క్ర‌మాలు ఎక్క‌డ నిర్వ‌హించాలా అన్న‌ది కీల‌కంగా మారింది. గ‌త జూన్ 13న తిరుప‌తి లో  బాహుబ‌లి సినీమా ఆడియో పంక్ష‌న్ నిర్వ‌హించారు బాహుబ‌లి టీం. తిరుప‌తి ఎస్వీయూ యూనివ‌ర్శిటి ని వేదిక‌ను చేసుకుని భారీ ఎత్తున్నసెట్టింగ్ ఏర్పాటు చేసి ఆడియో పంక్ష‌న్ నిర్వ‌హించారు.  ఈ విష‌యంలో ఆ సినీమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సీమాంద్ర లోని తిరుప‌తి వేదిక చేసుకోవ‌డంతో తెలంగాణ ప్రాంతంలో కొంత వ‌రకు తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిగ్ గానే మారింది. బాహుబ‌లి మా తెలంగాణ వాడ‌ని, అలాంటిది ఆయ‌న పై తీసిన సినీమాను మా ప్రాంతంలోనే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని డిమాండ్లు సైతం వ‌చ్చాయి. 


ఇక‌పోతే హుద్ హుద్ తుఫాన్ తో విశాఖ ప‌ట్ట‌ణం తీవ్ర న‌ష్టం జరిగిన సంగతి విదితమే. భారీ ఇళ్లు భ‌వ‌నాలు, రోడ్లు, ర‌వాణ వ్య‌వ‌స్థ, స‌మాచార వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. అప్ప‌ట్లో విశాఖ ను ఆదుకొవ‌డానికి దేశంలోని రాష్ట్రాలేకాకుండా  విదేశీలు సైతం ముందుకు వ‌చ్చి త‌మ విరాళాలు ప్ర‌క‌టించారు. పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ సైతం త‌మవంతుగా విద్యుత్ ప‌రికరాల‌ను అంద‌జేసింది. ఇక‌పోతే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ హుద్ హుద్ బాదితుల‌ను ఆదుకోవ‌డానికి మేము సైతం అంటూ భారీ కల్చ‌ర‌ల్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి ఆదుకుంది.


అయితే ఈ కార్య‌క్ర‌మానికి ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ వేదిక గా చేసుకోవ‌డంతో.. ఆంద్ర రాష్ట్రంలో కొంత వ‌ర‌కు వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఏపీ కార్య‌క్ర‌మాన్ని ఏపీలోనే నిర్వ‌హించాల‌ని అప్ప‌ట్లో ప‌ట్టుబ‌ట్టారు. హైద‌రాబాద్ ఉమ్మడి ఆస్థి అయిన్న‌ప్ప‌టికి, అది తెలంగాణ‌కే చెందుతుంది అన్న వారి వాద‌న. ఇక‌పోతే..తాజాగా విడులైన గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన భారీ బ‌డ్జెట్ సినీమా రుద్ర‌మాదేవి చిత్రం కేవ‌లం తెలంగాణ కే ప‌రిమిత‌మైంద‌న్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. గతంలో ఈ  సినీమా టేల‌ర్ ను వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించ‌డం తో ఆంద్ర ప్ర‌జ‌ల‌కు మింగుడు పడ‌టంలేదు. అంతేకాకుండా ఈ సినీమా కూడా తెలంగాణ పరిపాలించిన రాణి రుద్ర‌మాదేవి ని గురించి ఉండ‌టం కొంత వ‌ర‌కు ఆంద్ర ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త చూపిస్తున్నార‌ని స‌మాచారం.


తెలుగు సినీమా ఇండ‌స్ట్రీ బాగు ప‌డాలంటే రెండు రాష్ట్రాలు కీల‌క‌మే. ఇరు రాష్ట్రాల ప్రేక్ష‌కులు ఆద‌రించాలి. ఇందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు  ఇరు రాష్ట్రాల‌కు న్యాయం చేయాలి. ఒక‌వైపు సినీమా స‌క్సెస్ పై దృష్టి, మ‌రోవైపు సినీమా ఏలా రిలీజ్ చేయాల‌ని.. ఇలా స‌మ‌స్య‌ల‌తో కొట్ట‌కుంటున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇరు రాష్ట్రాల‌కు స‌మ‌న్యాయం ఏలా చేయాల‌ని కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ప‌రిస్థితులు వేరు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృత్తం కావ‌డంతో తెలుగు సినీమా డైర‌క్ట‌ర్లు, హీరోలు, నిర్మాత‌లు సంక‌ఠ స్థితిలో ప‌డిపోయారు. ప్రొగ్రామ్ లు ఎక్కడ నిర్వ‌హించాల‌ని ఆయోమ‌య ప‌రిస్థితి లో ఉన్నారు. ఈ ప‌రిస్థితుల‌కు కాల‌మే స‌మాదానం చెప్పాల్సి ఉంటుందో ఎమో చూడాలి..!  


మరింత సమాచారం తెలుసుకోండి: