కొత్త అంశాలు తెరమీదకి వస్తున్నాయి, జాతీయ స్థాయి లో రాజకీయాలు రేపే విధానాలు ఇక్కడ వారు కూడా చేపడుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ అధికారులో, మంత్రులో ఏదైనా పుస్తకం రాసి దాంట్లో ఒక కాంట్రోవేర్సియల్ అంశాలు లేవదీయడం దాన్ని పట్టుకుని రాజకీయం చెయ్యడం అక్కడవారికి బాగా అలవాటు. ఆ పద్ధతి ఇక్కడ కూడా అవలంబిస్తున్నారుఅనిపిస్తుంది.


 'వంగవీటి మోహన రంగా' హత్యోదంతం గురించి


 'వంగవీటి మోహన రంగా' హత్యోదంతం గురించి మాజీ కాంగ్రెస్ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య రాసిన పుస్తకం లో రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం.. అని పేర్కొనడంతో దుమారం చెలరేగుతోంది. చేగొండి ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చాలంటూ బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ డిమాండ్‌ చేయడం విశేషమిక్కడ. విపక్షాల కంటే మిత్ర పక్ష బీజేపీ తోనే పేచీ ఎక్కువ అని అనుకుంటున్న టీడీపీ కి ఈ కొత్త తలనొప్పి ఒకటి వచ్చి పడింది.


ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా చెక్ పెట్టాలి అని చూస్తున్నారు చంద్రబాబు. వంగవీటి రాదా కృష్ణ ని లైన్ లో పెట్టి వివాదం సెట్టిల్ అయేలా చూడాలి అనేది బాబు కి కొందరు ఇస్తున్న ఉచిత సలహా. ప్రస్తుతం వై కా పా లో ఉన్న రంగా తనయుడు అప్పట్లో చిరంజీవి పార్టీ లో చేరారు. పవన్ కళ్యాణ్ కి బాగా క్లోజ్ అయిన ఆయన, ఆయన మీద అభిమానం వల్లన అప్పుడు ఆ పార్టీ లోకి వెళ్లారు. వంగవీటి రాధాకృష్ణకి  అత్యంత సన్నిహితంగా మెలిగే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సీన్ లోకి దిగుతాడా? దిగి తమ సామాజిక వర్గానికి చెందిన మనిషి ని హత్య చేసిన విషయం కాబట్టి తాను ఈ విషయంలో ఎంత వరకూ ఇన్వాల్వ్ అవుతాడు అనేది ప్రశ్న.


ఒక పక్క టీడీపీ ఎంపీలు పవన్ సహాయం తీసుకుని రాధా తో మాట్లాడి విషయం సద్దు మణిగే లాగా చూడాలి అని కోరబోతున్నారు అని తెలుస్తోంది.రంగా ఎపిసోడ్‌ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటూనే, అవసరమైతే పవన్‌కళ్యాణ్‌ని ప్రయోగించాల్సిందేనని చంద్రబాబుకి  కూడా అనిపిస్తోంది. ప్రస్తుతం డిల్లీ టూర్ లో పూర్తి సమయం కేటాయిస్తున్న బాబు అక్కడ నుంచి రాగానే పవన్ అనే ట్రంప్ కార్డ్ ని వాడబోతున్నారు అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: